పాటల సందడిలో.. నాగార్జున నా సామిరంగా

Music Sittings Begin For Nagarjuna's Naa Saami Ranga

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘నా సామిరంగా’. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ‘నేను లోకల్‌’, ‘ధమాకా’ సినిమాలకు పని చేసిన ప్రసన్న కుమార్‌ బెజవాడ ఈ సినిమాకు కథనందించగా.. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, మిర్న మీనన్‌ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా గత కొన్నిరోజుల క్రితం నాగార్జున బర్త్‌ డే సందర్భంగా రిలీజైన ‘నా సామిరంగా’ మూవీ టీజర్‌ అక్కినేని ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. చాలా రోజుల తర్వాత నాగార్జున ఫుల్ యాక్షన్‌ మోడ్‌లో కనిపించడంతో.. సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ‘నా సామిరంగా’ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి.

ఈ మేరకు హీరో నాగార్జున, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మరియు గీత రచయిత చంద్రబోస్ ముగ్గురూ కలిసిన సందర్భంలోని ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు గానూ కీరవాణి, చంద్రబోస్ ఇద్దరూ ‘ఆస్కార్’ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఆస్కార్ విన్నర్స్ కలిసి పనిచేయనున్న నేపథ్యంలో ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అవ్వడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు. కాగా ‘నా సామిరంగా’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + nine =