
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 239


సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బబుల్ గమ్

సలార్ టీమ్‌కి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు

మహారాష్ట్ర సీఎంతో చెర్రీ దంపతులు

డంకి ఫస్ట్ డే కలెక్షన్స్

శౌర్యాంగ పర్వం గా సలార్ పార్ట్ 2

సలార్ లో ఛాన్స్ పై జగ్గూభాయ్ క్లారిటీ

కలెక్షన్ల వేట మొదలుపెట్టిన సలార్

కాలేజ్ స్టూడెంట్ గా సూర్య?

సినిమా గెలుస్తుంది అంటున్న తేజ్

రివ్యూ : సలార్

రికార్డ్ స్థాయిలో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన చంద్రబోస్ డాక్యుమెంటరీ
గతకొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభ దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయంగా కూడా వెలుగొందుతోంది. ముఖ్యంగా దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ ఆర్' సినిమా అనేక సంచలనాలు సృష్టించింది. ఇందులో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా ఈ సినిమాకి పనిచేసిన పలువురు టెక్నీషియన్స్ కూడా గ్లోబల్ వైడ్ గా గుర్తింపు పొందారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో.. ఈ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు గానూ ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో కలిసి చంద్రబోస్ ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలో తాజాగా మరో తెలుగు డాక్యుమెంటరీ…

జూ.ఎన్టీఆర్‌కు అరుదైన గుర్తింపు.. టాలీవుడ్ నుంచి తొలి హీరోగా
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో దేశవ్యాప్తంగానే కాక గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు సాధించారు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. అచిరకాలంలోనే స్టార్ హీరో స్టేటస్ సొంతం చేసుకున్నారు. డ్యాన్స్‌లు, పాటలు పాడటం, అలవోకగా డైలాగ్స్ చెప్పడం వంటి మల్టీ ట్యాలెంటెడ్ నటనతో నాలుగు పదుల వయస్సుకే ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలో సినిమాల పరంగా ఎన్నో రికార్డులు అందుకున్నారు జూ. ఎన్టీఆర్. అలాగే మరికొన్ని అరుదైన ఘనతలను కూడా సొంతం చేసుకున్నారు. ఇటీవలే ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో ప్లేస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాగే పలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్…

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బబుల్ గమ్
బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా బబుల్ గమ్ సినిమా వస్తుంది.ఈసినిమా 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ కూడా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 24వ తేదీన రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 6 గంటల నుండి కార్యక్రమం జరగనుంది. ఇక ఈ యంగ్ హీరోలు అడివి శేష్, విశ్వక్…

బబుల్ గమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్- అతిథులుగా యంగ్ హీరోలు
నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమల తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో బబుల్ గమ్ సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. ఈసినిమాకు మాత్రం మంచి పాజిటివ్ బజ్ యే వస్తుంది. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈసినిమా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేకర్స్.

సలార్ టీమ్‌కి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ 'సలార్'. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఈ క్రమంలో తొలిభాగం 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బెనిఫిట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో డార్లింగ్ అభిమానుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వచ్చారంటే…

మహారాష్ట్ర సీఎంతో చెర్రీ దంపతులు
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు.

డంకి ఫస్ట్ డే కలెక్షన్స్
త్రీ ఇడియట్స్ ఫేమ్ రాజ్ కుమార్ హిరానీ ,బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా డంకి.నిన్న విడుదలైన ఈసినిమా డీసెంట్ రివ్యూస్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 60కోట్ల గ్రాస్ ను రాబట్టింది.విక్కీ కౌశల్ ,తాప్సి పన్ను,బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించిన ఈచిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించగా జియో స్టూడియోస్,రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్,రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్ నిర్మించాయి.

యానిమల్ అన్ స్టాపబుల్ 3వ వారం కలెక్షన్స్
సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఓటిటిలోకి ఆదికేశవ
ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్,సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల జంటగా నటించిన చిత్రం ఆదికేశవ.గత నెలలో విడుదలైన ఈసినిమాను కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా ఓటిటి లోకి వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.తెలుగు తోపాటు తమిళ ,మలయాళ,కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో వైష్ణవ్ డిఫ్రెంట్ గా కనిపించాడు.తన కెరీర్ లో మొదటి సారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించాడు.

హనుమాన్ టీమ్ కు సినిమాటోగ్రఫి మినిస్టర్ బెస్ట్ విషెస్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఫాంటసీ సినిమాగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో ఇప్పటికే జాంబిరెడ్డి సినిమా వచ్చి హిట్ అవ్వడంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచేశాయి.

శౌర్యాంగ పర్వం గా సలార్ పార్ట్ 2
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఫైనల్ నేడు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

సలార్ లో ఛాన్స్ పై జగ్గూభాయ్ క్లారిటీ
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇక ప్రభాస్ ను ఎలా చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారా వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రభాస్ ను అదే రేంజ్ మాస్ అవతార్ లో చూపించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ మాస్ యాక్షన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రభాస్ ను ఇలా చూడాలని ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న వారికి సలార్ ఫుల్ మీల్స్ ను అందించింది. ప్రస్తుతం ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని దూసుకెళ్తుంది.

సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్.. అరుదైన రికార్డ్ ముంగిట ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్'. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటిభాగం 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' నేడు (డిసెంబర్ 22, 2023) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాను చూసేందుకు ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్దకు క్యూ కడుతున్నారు. ఇక సలార్ బెనిఫిట్ షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి ఆ స్థాయి హిట్ వచ్చిందని సంబరపడుతున్నారు.

కలెక్షన్ల వేట మొదలుపెట్టిన సలార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కించారు. బాహుబలి తరువాత ప్రభాస్ నుండి ఆరేంజ్ హిట్ రాలేదు. సాహో యావరేజ్ గా నిలిచింది. ఆదిపురుష్ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో చూశాం. దాంతో సలార్ పైనే నమ్మకంతో ఉన్నారు. రెండు భాగాలుగా వస్తుండగా.. మొదటి పార్ట్ గా సలార్ సీజ్ ఫైర్ గా మొదటి పార్ట్ వస్తుంది. ఈసినిమాపై ఏ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అవ్వడం.. కె.జి.యఫ్…

ప్రభాస్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. సలార్ టికెట్స్ పంచిన నిఖిల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్'. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలిభాగం 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' ఈరోజు (డిసెంబర్ 22, 2023) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల వద్దకు ప్రభాస్ ఫ్యాన్స్ క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో సలార్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్ వద్ద డార్లింగ్ ఫ్యాన్స్ డ్యాన్స్‌లు, డప్పు చప్పుళ్లతో హోరెత్తిస్తూ, టపాసులు పేలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

సలార్ థియేటర్‌లో హీరో శ్రీవిష్ణు విజిల్స్.. వీడియో వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్'. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతుండగా.. తొలిభాగం 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' ఈరోజు (డిసెంబర్ 22, 2023) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. వాస్తవానికి ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి ఆ స్థాయి హిట్ సినిమా రాలేదు. అయితే ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ క్రమంలో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన సలార్ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో డార్లింగ్ అభిమానుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి.

కాలేజ్ స్టూడెంట్ గా సూర్య?
కెరీర్ మొదటినుండీ విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. పీరియాడిక్ డ్రామాగా భారీ బడ్జెట్ ఈసినిమా రాబోతుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది.

సినిమా గెలుస్తుంది అంటున్న తేజ్
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు నేటితో బ్రేక్ పడింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా సలార్. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈనేపథ్యంలో తాజాగా సాయి ధరమ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. మన తెలుగు సినిమా సలార్, ఈ రోజు షారుఖ్‌ఖాన్ డంకీ, హాలీవుడ్ ఫిలిం అక్వామెన్‌తో సరిసమానమైన క్రేజ్‌తో రిలీజ్ అవ్వడం ఎంతో సంతోషంగా, గర్వంగా వుంది. మూడు అగ్ర సినీ పరిశ్రమలు ఒకే సమయాన ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతికి ఇవ్వడానికి సిద్దం కావడం గొప్ప…

రివ్యూ : సలార్
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ అంచనాలను అందుకుంది అనే చెప్పొచ్చు. అంతేకాదు ఈసినిమా సెకండ్ పార్ట్ ఫై అంచనాలను పెంచేసింది.ప్రభాస్ మాస్ విశ్వరూపం, డైరెక్షన్ ,యాక్షన్ సీక్వెన్క్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఈసినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిందనే చెప్పొచ్చు.మాస్ ప్రేక్షకులకు మాత్రం సలార్ బాగా నచ్చేస్తుంది.

రికార్డ్ స్థాయిలో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్
ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయిపోయింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.