పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కించారు. బాహుబలి తరువాత ప్రభాస్ నుండి ఆరేంజ్ హిట్ రాలేదు. సాహో యావరేజ్ గా నిలిచింది. ఆదిపురుష్ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో చూశాం. దాంతో సలార్ పైనే నమ్మకంతో ఉన్నారు. రెండు భాగాలుగా వస్తుండగా.. మొదటి పార్ట్ గా సలార్ సీజ్ ఫైర్ గా మొదటి పార్ట్ వస్తుంది. ఈసినిమాపై ఏ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అవ్వడం.. కె.జి.యఫ్ ప్రాంఛైజీ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్టందించిన ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉండటం కామన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మంచి టాక్తో దూసుకెళ్తోంది. ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు అలా రిలీజ్ అయిందో లేదే అప్పుడే కలెక్షన్ల వేట మొదలైపోయింది. ఈసినిమా రిలీజ్ కు ముందే ఓవర్సీస్ లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈనేపథ్యంలోనే నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోకి గాను సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకుంది. ఒక్క ప్రీమియర్ షోకే ఈసినిమా 2.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మరి ఒక్క రోజుకే ఇలా ఉండే ముందు ముందు ఈసినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ రాబట్టుకుంటుందో చెప్పడం కష్టమే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: