పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతుండగా.. తొలిభాగం ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ ఈరోజు (డిసెంబర్ 22, 2023) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. వాస్తవానికి ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి ఆ స్థాయి హిట్ సినిమా రాలేదు. అయితే ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ క్రమంలో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన సలార్ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో డార్లింగ్ అభిమానుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎట్టకేలకు సలార్‌తో ప్రభాస్ సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాను చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాలలో సలార్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్ వద్ద డార్లింగ్ ఫ్యాన్స్ డ్యాన్స్‌లు, డప్పు చప్పుళ్లతో హోరెత్తిస్తూ, టపాసులు పేలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులు బెనిఫిట్ షోస్, మార్నింగ్ షోస్ చూసేందుకు నిన్న అర్ధరాత్రే థియేటర్స్ వద్దకి చేరుకున్నారు.
మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటుగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను చూసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. ఈ క్రమంలో హీరో శ్రీవిష్ణు హైదరాబాద్ నగరంలోని శ్రీరాములు థియేటర్‌లో సందడి చేశారు. నిన్న అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రదర్శించిన బెనిఫిట్ షోకు విచ్చేసిన ఆయన ప్రభాస్ అభిమానులతోపాటు సలార్ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా థియేటర్‌లో హీరో ఎలివేషన్ సీన్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్‌తో పాటు విజిల్స్ వేస్తూ కేరింతలు కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#TFNReels: Deva to Varadha, @sreevishnuoffl to movie!😉
Watch #Salaar to experience the whistle worthy moments!💣#Prabhas #SalaarCeaseFire #TeluguFilmNagar pic.twitter.com/51HXH2cEv1— Telugu FilmNagar (@telugufilmnagar) December 22, 2023
ఇక ఇదిలా ఉండగా మరోవైపు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రభాస్ ఫ్యాన్స్‌కి 100 టికెట్స్‌ని అందించి సర్‌ప్రైజ్ చేశారు. కాగా సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించగా.. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘వరదరాజ మన్నార్’ అనే కీలక పాత్ర పోషించారు. అలాగే టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: