కెరీర్ మొదటినుండీ విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. పీరియాడిక్ డ్రామాగా భారీ బడ్జెట్ ఈసినిమా రాబోతుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా సూర్య సుధా కొంగర దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. గతంలో గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఆకాశం నీ హద్దురా సినిమా రాగా ఆసినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరో సినిమాను చేస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమాలో సూర్య రోల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమా 1970 నేపథ్యంలో ఉంటుందని.. ఈసినిమాలో సూర్య పలు డిఫరెంట్ షేడ్స్ లో నటించనున్నాడని అందులో కాలేజ్ స్టూడెంట్ పాత్ర ఒకటని అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఈసినిమాలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, నజ్రియా,వినయ్ వర్మ ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాను తన సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ పై రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్, శ్రీమతి జ్యోతికతో కలిసి నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: