
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 240


సెన్సార్ కంప్లీట్ చేసుకున్న డెవిల్

ఫైనల్లీ ఊరు పేరు భైరవకోన రిలీజ్ డేట్ ఫిక్స్

సలార్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

విజయ్ 68 టైటిల్ పై మేకర్స్ సాలిడ్ క్లారిటీ

ఉడిపిలో ప్రారంభంమైన నాగచైతన్య తండేల్ షూటింగ్

సలార్ చరిత్ర సృష్టిస్తున్న అడ్వాన్స్ సేల్స్


రవితేజ ఈగల్ ట్రైలర్ రిలీజ్

తండేల్ షూటింగ్ అప్డేట్

హనుమాన్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

NBK 109 ఊటీ షెడ్యూల్ కంప్లీట్

భారీ సెట్ లో నా సామిరంగ టైటిల్ సాంగ్ షూట్
విజయ్ బిన్ని దర్శకత్వంలో కింగ్ నాగార్జున అక్కినేని హీరోగా వస్తున్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ఈసినిమా చాలా సైలెంట్ గా సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ న రీసెంట్ గానే రిలీజ్ చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌లో నాగార్జునతో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది.

వర్మ 'వ్యూహం' సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోన్న దిల్ రాజు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ 'వ్యూహం', 'శపథం' అనే సినిమాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు కూడా వర్మ 2014 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో.. 'పవర్ స్టార్', 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' మరియు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తదితర చిత్రాలను తీసిన విషయం గుర్తుండే ఉంటుంది. పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాలను రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ నేపథ్యంలో 'వ్యూహం' సినిమా డిసెంబర్ 29న గ్రాండ్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక…

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న డెవిల్
నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి. ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు మరింత పెంచుతున్నారు మేకర్స్. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మరోవైపు పాటలను కూడా వరుసగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాాలను కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్…

షారుఖ్ డంకీ రివ్యూ-కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల వారు ఈసినిమాను ఓసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్లజెంట్ గా సలార్ సెకండ్ సింగిల్ ప్రతికథలో సాంగ్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. సలార్ సీజ్ ఫైర్ అంటూ పార్ట్ 1 డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రం అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. ఫైనల్లీ మరి కొద్దిగంటల్లో వారి ఎదురుచూపులకు బ్రేక్ పడనుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, రెండు ట్రైలర్ లు రిలీజ్ చేయగా అవి సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ను మరింత పెంచేశాయి.

ఫైనల్లీ ఊరు పేరు భైరవకోన రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ లో కాస్త వైవిధ్యమైన సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకరు. అయితే సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేస్తున్నా మంచి విజయాలు మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇక ఏడాది మైఖేల్ తో వచ్చినా ఆ సినిమా కూడా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన అనే డిఫరెంట్ కథతో వస్తున్నాడు.

రామ్‌గోపాల్ వర్మ 'శారీ' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
రామ్ గోపాల్ వర్మ.. దేశంలో ఎంతోమంది దర్శకులకు గురువు వంటివాడు. ఆయన తీసిన సినిమాలను చూసి ప్రభావితమై చాలామంది యువకులు తాము కూడా దర్శకులుగా మారడానికి ఇండస్ట్రీకి వచ్చేశారు. తొలినుంచీ వైవిధ్యమైన కథలతో సినిమాలు తీసిన ఆయన.. ఈ క్రమంలో ఎంతోమంది కొత్తవారికి నటులుగా, టెక్నీషియన్లుగా మారడానికి అవకాశం కల్పించారు. ఇక కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో ముందుండే రామ్‌గోపాల్ వర్మ పలువురిని హీరోయిన్లుగా కూడా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా మరో కొత్త అమ్మాయికి తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమాకు రామ్‌గోపాల్ వర్మ కేవలం ప్రొడ్యూసర్‌గానే వ్యవహరిస్తుండటం…

సలార్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
మొత్తానికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్ మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. మరి ఎన్నో అంచనాల మధ్య రానున్న ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

‘యాత్ర 2’ నుంచి సీఎం జగన్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన చిత్రం 'యాత్ర'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, వైఎస్సార్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు, వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్ నటించగా.. సీనియర్ నేత గౌరు చరిత క్యారెక్టర్‌లో నటి అనసూయ కీలక పాత్రలో కనిపించారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'యాత్ర 2' రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్సార్ తనయుడు…

విజయ్ 68 టైటిల్ పై మేకర్స్ సాలిడ్ క్లారిటీ
దళపతి విజయ్ తన తరువాత సినిమా వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా విజయ్ 68 అనే టైటిల్ వర్కింగ్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా టైటిల్ బాస్ అని ఫిక్స్ చేస్తున్నట్టు పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆ వార్తలు కాస్త మేకర్స్ దృష్టికి వెళ్లడంతో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈసినిమా నిర్మాత అర్చన తన సోషల్ మీడియా ద్వారాా స్పందిస్తూ అన్ని వార్తలను చూస్తున్నా.. మీ ప్రేమకు థ్యాంక్స్.. కానీ నిజమైన టైటిల్ వచ్చేంతవరకూ ఓపికతో వెయిట్ చేయండి.. వెంకట్ ప్రభు మీ కోసం సంథింగ్ ప్రిపేర్ చేస్తున్నారు.. ఈసినిమా టైటిల్ ఖచ్చితంగా బాస్ అయతే కాదు అని క్లారిటీ ఇచ్చారు.

ఉడిపిలో ప్రారంభంమైన నాగచైతన్య తండేల్ షూటింగ్
నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. కండలు తిరిగిన దేహం కోసం గత కొన్ని నెలలుగా చాలా హార్ట్ వర్క్ చేశారు. పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గడ్ లుక్ లో కనిపించబోతున్నాడు.

సలార్ చరిత్ర సృష్టిస్తున్న అడ్వాన్స్ సేల్స్
ప్రశాంనీల్ దర్శకత్వంలో ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈసినిమా మొదటి భాగం సలార్-సీజ్ ఫైర్ డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

సలార్ ఫ్యాన్స్, ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా ఉంటుంది-విజయ్ కిరగందూర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో అందరూ ఆశ్చర్యపోయే ప్రొడక్షన్ వేల్యూస్‌తో ఈసినిమాను రూపొందించారు. మోస్ట్ అవెయిటెడ్ మూవీగా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అనేంత రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ‘సలార్ సీజ్ ఫైర్’ మూవీ జర్నీ గురించి హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఆసక్తికరమైన విషయాలను…

మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతవారం సతీసమేతంగా ముంబైకి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు (డిసెంబర్ 20, 2023)) తన భార్య ఉపాసన కొణిదెల మరియు కుమార్తె క్లిన్ కారాతో కలిసి ఇక్కడి ప్రముఖ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. కాగా మెగా ఫ్యాన్స్ క్లిన్ కారాను 'మెగా లిటిల్ ప్రిన్సెస్'గా పిలుచుకుంటుంటారన్న సంగతి తెలిసిందే. చరణ్-ఉపాసన దంపతుల ముద్దుల తనయ క్లిన్ కారా జన్మించి నేటికి సరిగ్గా 6 నెలలు అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారు నేడు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. కుమార్తె క్లిన్ కారా కోసం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు.

శేష్-శృతి హాసన్ మూవీ.. ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ రిలీజ్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్ పేరు ముందే ఉంటుంది. చాలా సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వరుస విజయాలు అందుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకూ కాస్త డిటెక్టివ్ తరహా సినిమాలే చేసిన అడివి శేష్.. ఈసినిమాతో లవ్ కథతో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ రీసెంట్ గానే ఇచ్చారు. ఇప్పటికే ఈసినిమా నుండి ప్రీ లుక్ లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ లుక్ ఇంకా టైటిల్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా. ఇక చెప్పినట్టే నేడు ఈసినిమా టైటిల్ టీజర్ ను అలానే ఫస్ట్ లుక్ ను…

రవితేజ ఈగల్ ట్రైలర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ మాత్రం సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈమధ్య కాలంలో రవితేజకు సరైన హిట్ పడింది లేదు. దీంతో ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఈగల్. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతుంది.

తండేల్ షూటింగ్ అప్డేట్
నాగచైతన్య తండేల్ షూటింగ్ నిన్న ప్రారంభమైంది.కర్ణాటక లోని ఉడిపిలో మొదటి షెడ్యూల్ జరుగుతుంది. 4రోజుల తరువాత షూటింగ్ గోకర్ణ కు షిఫ్ట్ కానుంది.ప్రస్తుతం హీరో అలాగే మిగితా కాస్ట్ ఫై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.4వ రోజు హీరోయిన్ సాయి పల్లవి షూటింగ్ లో జాయిన్ కానుంది.ఇక ఈసినిమా హిట్ అవ్వడం తప్పనిసరి కావడంతో సినిమాఫై చైతన్య ప్రత్యేకమైన శ్రద్ద పెట్టాడు.

హనుమాన్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. తెలుగు సూపర్ హీరో సినిమాగా ఈసినిమా వస్తుండటం.. అందులోనూ ప్రశాంత్ మేకింగ్ అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ రేసులో దిగనుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్.

నైజాంలో సలార్ బెనిఫిట్ షోలు ప్రదర్శించబడే థియేటర్లు ఇవే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ‘సలార్’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా తొలిభాగం ‘సలార్: పార్ట్ 1-సీజ్ ఫైర్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఒక శుభవార్త అందింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి లభించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీని ప్రకారం.. నిబంధనల మేరకు మొదటివారం టికెట్ ధరలు పెంచుకునేందుకు నిర్మాతలకు వెసులుబాటు కలిగింది. దీనితోపాటు నైజాంలో హైదరాబాద్ సహా…

NBK 109 ఊటీ షెడ్యూల్ కంప్లీట్
నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది.