ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయిపోయింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కోసం ఎంతలావెయిట్ చేస్తున్నారో ఈసినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి అర్థమవుతుంది. సినిమా రిలీజ్ కు ముందే కేవలం అడ్వాన్స్ టికెట్లతో నే ఈసినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈసినిమా ఇప్పటివరకూ ఎన్ని టికెట్లను బుక్ చేసుకుందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో 13.25 లక్షలు, నైజాం లో 6 లక్షలు, నార్త్ ఇండియాలో 5.25లక్షలు, కర్ణాటకలో 3.25 లక్షలు, కేరళలో 1.5 లక్షలు, తమిళ్ నాడులో 1 లక్ష ఓవరాల్ గా ఇండియాలో 30.25 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. మరి ఈరేంజ్ లో టికెట్లు బుక్ అవ్వడం అంటే మాములు విషయం కాదు. మరి రిలీజ్ తరువాత ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
THE MASS IS HERE 🔥💥#Salaar Advance tickets booked (Approx.) in India as of 11:59 PM on 20-Dec-2023 for the first day (22-Dec-2023), excluding National Chain Multiplexes (PVR, INOX, Cinepolis):
•Andhra Pradesh: 13.25 Lakhs
•Nizam (Telangana): 6 Lakhs
•North India: 5.25… pic.twitter.com/uXNkwDtoGa— Salaar (@SalaarTheSaga) December 21, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: