సినిమా గెలుస్తుంది అంటున్న తేజ్

sai dharam tej interesting post on salaar movie

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు నేటితో బ్రేక్ పడింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా సలార్. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈనేపథ్యంలో తాజాగా సాయి ధరమ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. మ‌న తెలుగు సినిమా స‌లార్, ఈ రోజు షారుఖ్‌ఖాన్ డంకీ, హాలీవుడ్ ఫిలిం అక్వామెన్‌తో స‌రిస‌మాన‌మైన క్రేజ్‌తో రిలీజ్ అవ్వ‌డం ఎంతో సంతోషంగా, గ‌ర్వంగా వుంది. మూడు అగ్ర సినీ ప‌రిశ్ర‌మ‌లు ఒకే స‌మ‌యాన ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన సినిమాటిక్ అనుభూతికి ఇవ్వ‌డానికి సిద్దం కావ‌డం గొప్ప విష‌యం. అన్నింటి కంటే ఈ రోజు సినిమా చాలా అగ్ర‌స్థాయిలో వున్న ఫీల్ క‌లుగుతుంది. ఈ అనుభూతి క‌ల‌గ‌డానికి కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క‌రికి నా ధ‌న్య‌వాదాలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డంకీ చిత్రంతో వ‌రుస‌గా మూడు స‌క్సెస్‌ల‌తో హ్య‌ట్రీక్ స‌క్సెస్ సాధించిన షారుఖ్ సార్‌.. యువ‌ర్ క‌మ్ బ్యాక్ ఈజ్ సో గ్రేట్‌. స‌లార్‌తో వెండితెర‌పై ఫైర్ క్రియేట్ చేయ‌డానికి సిద్దమైన ప్ర‌భాస్ అన్న‌కు, అక్వామెన్ సినిమాకు నా బెస్ట్ ఆఫ్ ల‌క్‌. అంటూ సాయిధ‌ర‌మ్ తేజ్ పోస్ట్ చేశాడు. ఇక సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది.

కాగా విరూపాక్ష, బ్రో సినిమాలతో వరుసగా హిట్లను అందుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాంజాా శంకర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈసినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మ్యాడ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. రిషి పంజాబీ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 3 =