బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా బబుల్ గమ్ సినిమా వస్తుంది.ఈసినిమా 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ కూడా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 24వ తేదీన రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 6 గంటల నుండి కార్యక్రమం జరగనుంది. ఇక ఈ యంగ్ హీరోలు అడివి శేష్, విశ్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ తో పాటు డైరెక్టర్ నందిని రెడ్డి విచ్చేయనున్నారు. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈసినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Bubblegum Censored & Certified “A” 🔥❤️
Love and Respect takes centre stage in just 6 days 🥳
In cinemas from Dec 29th 🎥@ravikanthperepu @RoshanKanakala @Maanasa_chou @sureshraghu_DOP @SricharanPakala @maheshwarimovie @VarnikhaVisuals @peoplemediafcy #TeluguFilmNagar pic.twitter.com/rTSMHmCPxw
— Telugu FilmNagar (@telugufilmnagar) December 23, 2023
కాగా ఈసినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం.. సురేష్ రగుతు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: