ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఫైనల్ నేడు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రెండు పార్ట్ లుగా వచ్చిన ఈసినిమాలో మొదటిపార్ట్ ను సలార్..సీజ్ ఫైర్ అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ కు కూడా పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. సలార్ పార్ట్-2కు శౌర్యాంగ పర్వం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. రెండో భాగానికి పవర్ ఫుల్ టైటిల్ పెట్టడంతో అభిమానుల్లో ఆ సినిమాపై హైప్ మరింత పెరిగింది. మరి ఇప్పటికేే ఫస్ట్ పార్ట్ ఎండింగ్ తో సెకండ్ పార్ట్ పై క్యూరియాసిటీని పెంచేశాడు ప్రశాంత్. దీంతో ఈ పార్ట్ పై ఇప్పటినుండే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
కాగా సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబి సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. . హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: