సలార్ లో ఛాన్స్ పై జగ్గూభాయ్ క్లారిటీ

jagapathi babu clarity on his role in salaar movie

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇక ప్రభాస్ ను ఎలా చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారా వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రభాస్ ను అదే రేంజ్ మాస్ అవతార్ లో చూపించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ మాస్ యాక్షన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రభాస్ ను ఇలా చూడాలని ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న వారికి సలార్ ఫుల్ మీల్స్ ను అందించింది. ప్రస్తుతం ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని దూసుకెళ్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో జగపతిబాబు కూడా నటించిన సంగతి తెలిసిందే కదా. రాజమన్నార్ అనే పాత్రలో నటించాడు జగ్గూభాయ్. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాలో తనకు ఎలా వచ్చిందో తెలియచేశాడు జగపతిబాబు. ప్రశాంత్ నీల్‌ సలార్‌ కోసం నన్ను అనుకోలేదు. కె.జి.యఫ్ 2 తరువాత నేనే ప్రశాంత్‌ నీల్‌కు కాల్ చేసి.. అతనితో పనిచేయాలని ఉందని చెప్పా. అయితే నీల్ అది గుర్తుపెట్టుకున్నారు. ఈనేపథ్యంలోనే సలార్‌ స్క్రిప్ట్‌ రెడీ అవుతున్నప్పుడు.. నాకు కాల్‌ చేసి రాజమన్నార్‌ పాత్రలో నటించే అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చాడు జగ్గూభాయ్‌.

కాగా సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. పృథ్విరాజ్ సుకుమారన్‌, జగపతిబాబు, బాబి సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్‌, సప్తగిరి, సిమ్రత్‌ కౌర్‌, పృథ్విరాజ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. . హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =