రివ్యూ : సలార్

salaar movie telugu review

నటీనటులు : ప్రభాస్,శృతి హాసన్,పృథ్వీరాజ్ సుకుమారన్
ఎడిటింగ్ : ఉజ్వల్ కులకర్ణి
సినిమాటోగ్రఫీ :భువన గౌడ
సంగీతం : రవి బస్రూర్
దర్శకత్వం :ప్రశాంత్ నీల్
నిర్మాత : విజయ్ కిరగందూర్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాహో తరువాత ప్రభాస్ యాక్షన్ జోనర్ లో నటించిన సినిమా సలార్.దీనిని కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయడంతో సలార్ కు ముందు నుంచే భారీ హైప్ ఏర్పడింది.దీనికి తోడు రీసెంట్ గా రిలీజైన  రెండు ట్రైలర్లు అలాగే సూరీడే సాంగ్ సినిమాఫై అంచనాలను అమాంతం పెంచేశాయి.ఇక భారీ అంచనాల మధ్య ఈ రోజే మొదటి భాగం సలార్ సీజ్ ఫైర్ థియేటర్లలోకి వచ్చింది.మరి ఈసినిమా అంచనాలను అందుకుందా? ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది లేదో ఇప్పుడు చూద్దాం.

కథ :

ఖాన్ సార్ సామ్రాజ్యం కింగ్ కొడుకు అయిన వరద రాజ్ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) అలాగే దేవా (ప్రభాస్) చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు.నీకు ఎప్పడు ఆపద వచ్చినా నన్ను పిలువు అని దేవా చిన్నప్పుడే వరదకు చెప్తాడు. అయితే ఒకానొక సందర్భంలో వరదకు దేవా సహాయం కావాల్సి వస్తుంది. దాంతో దేవా, వరద కోసం ఏం చేయాల్సి వస్తుంది. ఇంతకీ వరద ,దేవా సహాయం ఎందుకు కోరాల్సి వస్తుంది అనేది మిగితా కథ .

విశ్లేషణ :

కెజియఫ్ తో తానేంటో నిరూపించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.కంటెంట్ పక్కన పెడితే హీరో కు ఇచ్చిన ఎలివేషన్ సీన్స్ కు మాస్ ప్రేక్షకులు, యూత్ ఫిదా అయ్యారు.రాజమౌళి తరువాత ఆరేంజ్ ఎలివేషన్ లు ఇచ్చే డైరెక్టర్ గా నీల్ పేరుతెచ్చుకున్నారు.కెజియఫ్ 2లో కూడా భారీ ఎలివేషన్లు బాగా వర్క్ అవుట్ అయ్యాయి.అలాగే వీటికి తోడు ఈ రెండు సినిమాల్లో డ్రామా కూడా ఆకట్టుకుంది.

ఇక సలార్ విషయంలో మరోసారి ఇదే మ్యాజిక్ ను క్రియేట్ చేశాడు నీల్.కాకపోతే కెజియఫ్ లో తల్లి సెంటిమెంట్ తో డ్రామా నడిపించగా సలార్ లో ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య డ్రామా నడిపించాడు.యష్ లాంటి హీరోనే తన ఎలివేషన్ లతో ఓరేంజ్ లో చూపించిన ప్రశాంత్ నీల్ కు భారీ కట్ అవుట్ వున్న ప్రభాస్ దొరికితే ఇంకెలా చూపించాలి.ఈవిషయంలో ఎక్కడా నిరాశపర్చలేదు.ఫస్ట్ హాఫ్ లోపెద్దగా స్టోరీ ఏం లేకపోయినా యాక్షన్ సీక్వెన్క్ తో వావ్ అనిపించాడు.ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అయ్యాయి.వీటిని డిజైన్ చేసిన తీరు బాగుంది.ఇంటర్వెల్ సీక్వెన్క్ తో సెకండ్ హాఫ్ ఫై అంచనాలు భారీ గా పెరుగుతాయి.

ఇక సెకండ్ హాఫ్ లోనే అసలు కథ  ప్రారంభం అవుతుంది.అయితే ఇందులో కూడా ఫైట్ సీక్వెన్స్  అదుర్స్ అనిపించాయి.ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఎక్కువగా స్టాటిసిఫై చేస్తుంది.ముఖ్యంగా క్లైమ్యాక్స్ ను చాలా బాగా చూపించారు.ఈ సీక్వెన్క్ తో సెకండ్ పార్ట్ ఫై భారీ అంచనాలు క్రియేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా సలార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఏం కావాలో అది ఇచ్చింది. డైరెక్టర్ యాక్షన్స్ సీక్వెన్స్ లకు ప్రభాస్ ను వాడుకున్న తీరు హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.ప్రభాస్ ఎలివేషన్ షాట్స్ థియేటర్లలో చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం.

నటీనటుల విషయానికి వస్తే సలార్ లో ప్రభాస్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు.నటన ,ఫైట్స్, లుక్స్  ప్రతి విషయంలో మెప్పించాడు.దేవా పాత్రను అద్భుతంగా పోషించాడు.బాహుబలి 2 తరువాత ప్రభాస్ తన  ఫ్యాన్స్ కు మళ్ళీ ఆ రేంజ్ లో సలార్ తో కిక్ ఇచ్చాడు అని చెప్పొచ్చు. ఇక మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాకు అసెట్.వరద పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు.తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడంతో తెర మీద ఆ పాత్ర చాలా బాగా అనిపించింది. మిగితా కీలక పాత్రల్లో నటించిన జగపతి బాబు,ఈశ్వరి రావు, శ్రీయా రెడ్డి తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీకల్ గా సినిమా ఉన్నతంగా వుంది.ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ ఒకటే కలర్ టోన్ లో ఉంటాయి.ఈ సినిమా కూడా అంతే.అయినా సినిమాటోగ్రఫీ మాత్రం టాప్ నాచ్.సంగీతం విషయానికి వస్తే సూరీడే సాంగ్ తెర మీద కూడా అదిరిపోయింది. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.ఎడిటింగ్ ఓకే. నిర్మాణం కూడా చాలా రిచ్ గా వుంది.

ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ అంచనాలను అందుకుంది అనే చెప్పొచ్చు. అంతేకాదు ఈసినిమా సెకండ్ పార్ట్ ఫై అంచనాలను పెంచేసింది.ప్రభాస్ మాస్ విశ్వరూపం, డైరెక్షన్ ,యాక్షన్ సీక్వెన్క్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఈసినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిందనే చెప్పొచ్చు.మాస్ ప్రేక్షకులకు మాత్రం సలార్ బాగా నచ్చేస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 4 =