కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికైన చంద్రబోస్‌ డాక్యుమెంటరీ

Oscar Challagariga Documentary Selected For Cannes World Film Festival

గతకొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభ దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయంగా కూడా వెలుగొందుతోంది. ముఖ్యంగా దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ ఆర్’ సినిమా అనేక సంచలనాలు సృష్టించింది. ఇందులో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా ఈ సినిమాకి పనిచేసిన పలువురు టెక్నీషియన్స్ కూడా గ్లోబల్ వైడ్ గా గుర్తింపు పొందారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో.. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు గానూ ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో కలిసి చంద్రబోస్ ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలో తాజాగా మరో తెలుగు డాక్యుమెంటరీ ఫ్రాన్స్‌లోని కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ నామినీగా ఎంపికైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్‌కు చెందిన చిల్కూరి సుశీల్ రావు స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన “ఆస్కార్ చల్లగరిగ” అనే డాక్యుమెంటరీ ఫ్రాన్స్‌లోని కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది. ఇది టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్‌పై తీసిన డాక్యుమెంటరీ కావడం విశేషం. కాగా చంద్రబోస్‌ అసలు పేరు కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్‌. ఆయన స్వగ్రామం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ. ఇదే పేరుతో ఈ డాక్యూమెంటరీ రూపొందించడం గమనార్హం. ఈ మేరకు కేన్స్ చిత్రోత్సవంలో ఆస్కార్‌ చల్లగరిగ షార్ట్‌ లిస్ట్‌ అయినట్టు సుశీల్‌ రావు ఓ ప్రకటనలో వెల్లడించారు.

కాగా కేన్స్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ప్రపంచవ్యాప్తంగా అమెరికా, జర్మనీ, కెనడా, బల్గేరియా, ఫ్రాన్స్‌, చైనా, ఆస్ట్రేలియా, స్వీడన్‌, స్పెయిన్‌ తదితర దేశాల నుంచి వచ్చిన చిత్రాలు పోటీ పడ్డాయి. ఇంత భారీ కాంపిటిషన్ మధ్య ఆస్కార్‌ చల్లగరిగ షార్ట్‌ లిస్ట్‌ అవడం విశేషం. ఇక ఆస్కార్ అవార్డ్ అందుకున్న సందర్భంగా చంద్రబోస్‌కు స్వగ్రామంలో అపూర్వ స్వాగతం పలికారు. చంద్రబోస్ విజయాన్ని గ్రామం మొత్తం కలిసి అద్భుతంగా జరుపుకుంది. ఈ క్రమంలో ఆయన చిన్ననాటి స్నేహితులు, పాఠశాల మరియు కళాశాల స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు మరియు గ్రామస్తులందరూ సత్కరించారు. ఈ నేపథ్యంలో గ్రామంతో చంద్రబోస్‌కు ఉన్న అనుబంధం, అక్కడివారితో ఆయనకున్న సాన్నిహిత్యం వంటి సున్నితమైన అంశాలను మేళవించి ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్టు దర్శక,నిర్మాత సుశీల్‌ రావు తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − seven =