హనుమాన్ టీమ్ కు సినిమాటోగ్రఫి మినిస్టర్ బెస్ట్ విషెస్

cinematography minister Komatireddy venkat reddy best wishes to hanuman team

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఫాంటసీ సినిమాగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో ఇప్పటికే జాంబిరెడ్డి సినిమా వచ్చి హిట్ అవ్వడంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ట్రైలర్ ను రీసెంట్ గానే పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈసినిమాలోని విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అందుకే ఈ ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. 30 మిలియన్స్ కు పైగా వ్యూస్ తో ప్రస్తుత దూసుకుపోతుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా చిత్ర యూనిట్ తెలంగాణ సినిమాటోగ్రఫి మినిస్టర్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని కలిశారు. ఈనేపథ్యంలో ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయిన మినిస్టర్ చిత్రయూనిట్ కు బెష్ట్ విషెస్ ను అందించారు.

కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =