ప్రభాస్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. సలార్ టికెట్స్ పంచిన నిఖిల్

Salaar Nikhil Siddhartha Gives 100 Tickets To Prabhas Fans

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’. ‘కేజీఎఫ్‌’ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలిభాగం ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ ఈరోజు (డిసెంబర్ 22, 2023) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల వద్దకు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో సలార్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్‌ వద్ద డార్లింగ్ ఫ్యాన్స్ డ్యాన్స్‌లు, డప్పు చప్పుళ్లతో హోరెత్తిస్తూ, టపాసులు పేలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులు బెనిఫిట్ షోస్, మార్నింగ్ షోస్ చూసేందుకు నిన్న అర్ధరాత్రే థియేటర్స్ వద్దకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించారు. ఈ తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలోని శ్రీరాములు థియేటర్‌కి వచ్చిన ఆయన ముందుగా ఒక వంద టికెట్స్ ని కొనుగోలు చేశారు. అనంతరం వాటిని అక్కడికి వచ్చిన ప్రభాస్ అభిమానులకు అందజేశారు. దీంతో ఒక్కసారిగా వారు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు.

ఇక తమ అభిమాన హీరో మోస్ట్ అవైటెడ్ మూవీ చూసేందుకు సాయం చేసిన నిఖిల్‌కి ప్రభాస్ ఫ్యాన్స్ కృతజ్ఞతలు తెలియజేశారు. దీనికి సంబంధించి నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. పలువురు ప్రభాస్ అభిమానులు ఆయన చేసిన పనికి మెచ్చుకుంటూ అభినందిస్తున్నారు. కాగా సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించగా.. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ ‘వరదరాజ మన్నార్’ అనే కీలక పాత్ర పోషించారు. అలాగే టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్‌, సప్తగిరి, సిమ్రత్‌ కౌర్‌, పృథ్విరాజ్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − seventeen =