కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 214

Anjali Yezhu Kadal Yezhu Malai Movie Response
సినిమా వార్తలు

రిలీజ్ కు ముందే అంజలి సినిమాపై ప్రశంసలు

ఫొటో మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నటి అంజలి. ఆ సినిమా తెలుగులో పలు సినిమాల్లో నటించింది. అయితే షాపింగ్ మాల్, జర్నీ సినిమాలతో తెలుగులో కంటే కూడా తమిళ్ లో ఎక్కువగా క్రేజ్ ను సొంతం చేసుకుంది. దాంతో అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ ఆమె బిజీగా ఉంటోంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సీ 15లో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా విశ్వక్ సేన్ నటిస్తున్న 11వ సినిమాలో కూడా నటిస్తుంది. అంతేకాదు ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.

TFN Adminవాట్సాప్
Gaami Movie Release Date Update
రిలీజ్ అప్‌డేట్

గామి రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ నటుడు విశ్వక్‌ సేన్‌ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో గామి సినిమా కూడా ఒకటి. అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌గా వస్తోన్న ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్‌ అఘోరాగా కనిపించబోతున్నాడు. నిజానికి ఈసినిమాను ఎప్పుడో ప్రారంభించారు. కానీ ఈసినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో ఇప్పటివరకూ రిలీజ్ కాలేకపోయింది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనలను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Mrunal Thakur Interesting Comments on Nepotism in Film Industry
సినిమా వార్తలు

నెపోటిజంపై మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

నెపోటిజం (బంధుప్రీతి).. ఇటీవల ఈ మాట తరచుగా వినిపిస్తోంది. నిజానికి ప్రతీ ఒక్క రంగంలో వారసత్వం అనేది సహజంగా ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీ మరియు రాజకీయ రంగాల్లో ఇది ఇంకొంచెం ఎక్కువగా వినపడుతోంది. దానికి కారణం మీడియా ఫోకస్ ఎప్పుడూ వీరిపై ఉంటుంది. సినిమా పరిశ్రమ విషయానికొస్తే.. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ వరకు హీరోల నుంచి టెక్నీషియన్స్ వరకూ ఎంతోమంది వారసులు కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలోని వ్యక్తులు దీనిని అంత పెద్ద విషయంగా భావించరు. కానీ బయటి ప్రపంచానికి మాత్రం ఇది అసాధారణ విషయంగా కనిపిస్తుంది.

Srikanth Mవాట్సాప్
animal creates all time record on Netflix
ఓటీటీ

యానిమల్ ఆల్ టైం రికార్డు

యానిమల్ థియేటర్లలోనే కాదు ఓటిటి లోనూ రికార్డులు క్రీయేట్ చేస్తుంది.గత ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 800కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఇక రెండు వారాల క్రితంఓటిటి లో విడుదలై వ్యూస్ పరంగా ఆల్ టైం రికార్డు సృష్టించింది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొని రాగ 39.3 మిలియన్ వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకుంది.దాంతో అత్యధిక వ్యూయర్ షిప్ ను రాబట్టిన సినిమాగా యానిమల్ రికార్డు క్రియేట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Ooru Peru Bhairavakona paid premieres date fixed
సినిమా వార్తలు

ఊరు పేరు భైరవకోన పెయిడ్ ప్రీమియర్స్ కు డేట్ ఫిక్స్

ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఫాంటసీ అడ్వెంచర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఫిబ్రవరి16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Ayalaan streaming from Feb 9th on Sun NXT
ఓటీటీ

అయలాన్ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ అయలాన్ ఓటిటి లోకి రానుంది.ఈనెల 9నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానున్నామని హక్కులను దక్కించుకున్న సన్ నెక్స్ట్ అధికారికంగా ప్రకటించింది.ఇక గత నెలలో పొంగల్ కు విడుదలైన ఈసినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఈసినిమా ఈనెల జనవరి 26న తెలుగులో విడుదలకావాలి.ఇందుకోసం శివ కార్తికేయన్ ప్రమోషన్స్ కూడా చేశాడు కానీ ఆర్థిక సమస్యల వల్ల చివరి నిమిషంలో విడుదల ఆగిపోయింది.

Mahender Reddyవాట్సాప్
Nandanandanaa full song out From Family Star movie
సాంగ్

ఫ్యామిలీ స్టార్ నుండి నందనందన ఫుల్ సాంగ్ రిలీజ్

సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఉంటుంది రౌడీహీరో విజయ్‌ దేవరకొండ క్రేజ్. నిజానికి విజయ్ కు సాలిడ్ హిట్ పడి చాలా కాలమే అవుతుంది. ఈమధ్య ఖుషి సినిమా రిలీజ్ అయింది కానీ ఆ సినిమా నార్మల్ హిట్ అయింది కానీ ఆశించినంత స్థాయి రెస్పాన్స్ రాలేదని చెప్పొచ్చు. అయినా కూడా విజయ్ కు మాత్రం అవకాశాలకు ఢోకా లేదు. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. అందులో ఫ్యామలీ స్టార్ సినిమా ఒకటి. పరశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
eagle release trailer out
ట్రైలర్ & టీజర్

ఈగల్ సెకండ్ ట్రైలర్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమా విజయం రవితేజ కు తప్పనిసరి కానుంది.రవితేజ అయితే ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.ఫైనల్ కాపీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.ఫ్యాన్స్ కూడా షూర్ షాట్ హిట్ అని సంబరపడిపోతున్నారు.ఇక ఇప్పటివరకు వదిలిన ప్రమోషన్ కంటెంట్ కూడా ఎక్కడా నిరాశపర్చలేదు.ఇక ఇప్పుడు ఆ హైప్ ను మరింత పెంచేందుకు రిలీజ్ ట్రైలర్ ను కూడా వదిలారు.

Mahender Reddyవాట్సాప్
Producer Dil Raju Meets CM Revanth Reddy to Invite For Ashish's Wedding
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దిల్ రాజు

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు అయన బుధవారం తన కుటుంబసభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో దిల్ రాజు సోదరుడు శిరీష్, కుమార్తె, అల్లుడు, సోదరుని కుమారుడు, యంగ్ హీరో ఆశిష్ తదితరులు వున్నారు. కాగా ఆశిష్ వివాహం త్వరలో జరుగనున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె అద్వైతా రెడ్డి, ఆశిష్‌లకు గతేడాది నవంబర్‌లో ఎంగేజ్‍మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 14న వీరి వివాహం జరుగనుంది.

Srikanth Mవాట్సాప్
siddhu jonnalagadda and bommarillu bhaskar movie title released
సినిమా వార్తలు

సిద్దు-బొమ్మరిల్లు భాస్కర్ మూవీ టైటిల్ రిలీజ్

గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. టిల్లూ స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Saripodhaa Sanivaaram Wraps up the Crucial Second Schedule
షూటింగ్ అప్‌డేట్

సరిపోదా శనివారం.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

నేచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న' తర్వాత హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో 'అంటే సుందరానికి' సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంతో మరోసారి వీరి కాంబో రిపీట్ కానుంది. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కోలీవుడ్ డైరెక్టర్ కమ్ హీరో ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపించనున్నాడు. 'ఆర్ఆర్ఆర్' వంటి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించిన డీవీవీ దానయ్య డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దీనిని తెరకెక్కిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
lal salaam movie completes censor formalities
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న లాల్ సలామ్

ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. ఓ క్రికెట్ మ్యాచ్ ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసిన తీరు, తర్వాత వాటి వల్ల ఓ గ్రామం ఎదుర్కొన్న సంఘర్షణ ఆధారంగా లాల్ సలామ్ మూవీని రూపొందించారు. ఈసినిమాలో రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొయిద్దీన్ భాయ్‌గా ర‌జినీకాంత్ కనిపించనున్నారు. ఈసినిమా పొంగల్ కే రిలీజ్ అవ్వాలి కానీ పొంగల్ కు పలు సినిమాలు లిస్ట్ లో ఉండటంతో ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Eagle Actress Kavya Thapar Praises Mass Maharaja Ravi Teja
సినిమా వార్తలు

ఈగల్ సెట్స్‌లో రవితేజ ఎలా ఉండేవారంటే..? కావ్య థాపర్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ కావ్య థాపర్ 'ఈగల్' విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
interesting update from vishwaksen gaami movie
సినిమా వార్తలు

గామి నుండి రానున్న బిగ్ అప్ డేట్

యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉగా అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అఘోరా గెటప్ లో ఉన్న విశ్వక్ లుక్ అయితే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈ సినిమా నుండి బిగ్ అప్ డేట్ రేపు అంటే ఫిబ్రవరి 7వ తేదీన రాబోతుందని తెలిపారు. మరి ఆ బిగ్ అప్ డేట్ ఏంటో తెలియాలంటే రేపటివరకూ ఆగాల్సింది.

TFN Adminవాట్సాప్
The Kerala Story is coming to zee5 this Feb 16th
ఓటీటీ

ఓటిటిలోకి వచ్చేస్తున్న ది కేరళ స్టోరీ

వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ ఎట్టకేలకు ఓటిటి లోకి వచ్చేస్తుంది.ఎప్పుడో రావాల్సిన ఈసినిమా పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఇప్పుడు వస్తుంది.జీ 5 ఈసినిమా ఓటిటి హక్కులను దక్కించుకుంది.ఈనెల 16నుండి ది కేరళ స్టోరీని స్ట్రీమింగ్ లోకి తీసుకరానున్నామని అధికారికంగా ప్రకటించింది.అయితే హిందీతోపాటు దక్షిణాది భాషల్లో అదే రోజు స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తుందా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

Mahender Reddyవాట్సాప్
Gaganaala full song out from Operation Valentine movie
సాంగ్

ఆపరేషన్ వాలెంటైన్ నుండి గగనాల ఫుల్ సాంగ్ రిలీజ్

ముకుంద సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మెగా హీరో వరుణ్ తేజ్. మొదటి సినిమా అంతలా విజయం సాధింకపోయినా ఆ తరువాత ఫిదా సినిమాతో మాత్రం మంచి హిట్ ను కొట్టి ఆ తరువాత తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్ 2 ఇలా వరుస విజయాలు అందుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఈమధ్యకాలంలో సరైన హిట్ ను అందుకోలేకపోయాడు వరుణ్. గని రీసెంట్ గా రిలీజ్ అయిన గాండీవధారి అర్జున కూడా పరాజయం సొంతం చేసుకున్నాయి. దీంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా ఆపరేషన్ వేలంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
pawan kalyan powerful poster released from OG movie
ఫస్ట్ లుక్

OG నుండి పవన్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పవన్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో తను చేస్తున్న కొత్త సినిమాల షూటింగ్ లు అన్నీ పెండింగ్ లో ఉన్నాయి. తన నుండి కొత్త సినిమా రావాలంటే కొద్ది రోజులు మాత్రం వెయిట్ చేయక తప్పుదు ఫ్యాన్స్. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగింది.

TFN Adminవాట్సాప్
Four films will be released this week
సినిమా వార్తలు

ఈవారం విడుదలవుతున్న సినిమాలు ఇవే

గత వారం 9సినిమాల వరకు విడుదలకాగా అందులో అంబాజీ పేట మ్యారేజి బ్యాండు ఒక్కటే సౌండ్ చేస్తుంది.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను కూడా క్రాస్ చేసి క్లీన్ హిట్ అనిపించుకుంది.ఇక ఈవారం నాలుగు సినిమాలు విడుదలకానున్నాయి.వీటన్నింటికి మంచి బజ్ వుంది.ఇందులో ముందుగా ఈనెల 8న యాత్ర 2 విడుదలకానుంది.యాత్ర కు సీక్వెల్ గా మహి వి రాఘవ్ తెరకెక్కించాడు.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలను బేస్ చేసుకొని జగన్ మెహన్ రెడ్డి ఎలా సీఎం అయ్యాడో ఇందులో చూపెట్టనున్నారు.ఈసినిమాలో వైస్ జగన్ గా జీవా నటించాడు.ఈసినిమాకు దాదాపు 50కోట్ల బడ్జెట్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
animal movie create sensational record
సినిమా వార్తలు

యానిమల్ మరో సెన్సేషనల్ రికార్డ్

సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన వయోలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాలో మరోసారి తన సత్తా చూపించాడు సందీప్ వంగా. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Upasana Konidela Interesting Comments on Thalapathy Vijay's Political Entry
సినిమా వార్తలు

విజయ్ పొలిటికల్ ఎంట్రీపై.. ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి ఎంటరైన విషయం తెలిసిందే. ఆయన తన పార్టీ పేరును 'తమిళగ వెట్రి కళగం' అని ప్రకటించారు. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీపై తమిళనాట పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే, ఇప్పటికే అక్కడ రజనీకాంత్ లాంటి దిగ్గజ హీరో పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేయడం, ఆ తర్వాత వెనకడుగు వేయడం, అలాగే మరో ప్రముఖ హీరో కమల్ హాసన్ కూడా 'మక్కల్ నీది మయ్యం' పార్టీని స్థాపించి క్రితం ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం ప్రజలు చూశారు. ఈ క్రమంలో విజయ్ రాజకీయాల్లోకి రావడంపై ఒక్కొక్కరూ ఒక్కో రకంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్