ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఫాంటసీ అడ్వెంచర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఫిబ్రవరి16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాాగా ఈసినిమా పెయిడ్ ప్రీమియర్స్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 14వ తేదీన ఈసినిమా పెయిడ్ ప్రీమియర్స్ ను వేయనున్నారు. మరి సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారంటే ఈసినిమాపై మేకర్స్ ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థమవుతుంది. మరి ఈసినిమా సందీప్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఈసినిమాలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: