ఫొటో మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నటి అంజలి. ఆ సినిమా తెలుగులో పలు సినిమాల్లో నటించింది. అయితే షాపింగ్ మాల్, జర్నీ సినిమాలతో తెలుగులో కంటే కూడా తమిళ్ లో ఎక్కువగా క్రేజ్ ను సొంతం చేసుకుంది. దాంతో అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ ఆమె బిజీగా ఉంటోంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సీ 15లో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా విశ్వక్ సేన్ నటిస్తున్న 11వ సినిమాలో కూడా నటిస్తుంది. అంతేకాదు ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా అంజలి నుండి త్వరలో రాబోతున్న సినిమా ఎజు కాదల్ ఎజు మలై. అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ రామ్ ఈసినిమాకు దర్శకత్వంలో వహిస్తున్న ఈసినిమాలో నివిన్ పౌలీ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈసినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. అయితే రిలీజ్ కు ముందో ఈసినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈసినిమాను రోటర్‌డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈసినిమాను ప్రదర్శించారు. ఇక సినిమాను చూసిన ఫారినర్స్ హార్ట్ టచింగ్ గా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.
View this post on Instagram
కాగా ఈసినిమాను వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాచి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. సినిమాటోగ్రఫి ఎన్ కే ఏకాంబరన్ అందించనున్నారు. మరి ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























