గత వారం 9సినిమాల వరకు విడుదలకాగా అందులో అంబాజీ పేట మ్యారేజి బ్యాండు ఒక్కటే సౌండ్ చేస్తుంది.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను కూడా క్రాస్ చేసి క్లీన్ హిట్ అనిపించుకుంది.ఇక ఈవారం నాలుగు సినిమాలు విడుదలకానున్నాయి.వీటన్నింటికి మంచి బజ్ వుంది.ఇందులో ముందుగా ఈనెల 8న యాత్ర 2 విడుదలకానుంది.యాత్ర కు సీక్వెల్ గా మహి వి రాఘవ్ తెరకెక్కించాడు.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలను బేస్ చేసుకొని జగన్ మెహన్ రెడ్డి ఎలా సీఎం అయ్యాడో ఇందులో చూపెట్టనున్నారు.ఈసినిమాలో వైస్ జగన్ గా జీవా నటించాడు.ఈసినిమాకు దాదాపు 50కోట్ల బడ్జెట్ అయ్యింది.
ఇక 9న రవితేజ ఈగల్ విడుదలకానుంది.సంక్రాంతికి రావాల్సివుండగా వెనక్కి వెళ్లి ఇప్పుడు వస్తుంది. ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది.రవితేజ అయితే ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.ఈగల్ ను కార్తిక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా అనుపమా పరమేశ్వరన్,కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.
ఇక అదే రోజు లాల్ సలామ్ అనే డబ్బింగ్ సినిమాకూడా విడుదలవుతుంది.సూపర్ స్టార్ రజినీకాంత్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు.దాంతో హైప్ ఏర్పడింది.రజినీ కూతురు ఐశ్వర్య ఈసినిమాను డైరెక్ట్ చేసింది.తెలుగు,తమిళ్ తోపాటు హిందీలోకూడా విడుదలవుతుంది.
ఇక ఈనెల 10న మరో డబ్బింగ్ సినిమా రిలీజ్ కానుంది అదే ట్రూ లవర్.ప్రముఖ డైరెక్టర్ మారుతీ, నిర్మాత ఎస్ కె ఎన్ లు తెలుగులో విడుదలచేస్తున్నారు.ప్రచార చిత్రాలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈసినిమా మరో బేబీ అవుతుందని అంటున్నాడు ఎస్ కె ఎన్.మణికందన్ హీరోగా నటించగా గౌరీ ప్రియా హీరోయిన్ గా చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
Eagle Team Round Table Interview | Ravi Teja | Anupama Parameswaran | Navdeep | Srinivas Avsarala
20:44
Eagle Movie POGA Funny Interview | Reel 2 | Ravi Teja | Anupama Parameswaran | Kavya Thapar | TFN
02:16
Eagle Movie POGA Funny Interview | Reel 4 | Ravi Teja | Anupama | Kavya Thapar | Ajay Ghosh
03:40
Kavya Thapar Super Fun With Suma | Eagle Pre Release Meet | Ravi Teja | Anupama Parameswaran | TFN
04:51
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: