మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమా విజయం రవితేజ కు తప్పనిసరి కానుంది.రవితేజ అయితే ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.ఫైనల్ కాపీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.ఫ్యాన్స్ కూడా షూర్ షాట్ హిట్ అని సంబరపడిపోతున్నారు.ఇక ఇప్పటివరకు వదిలిన ప్రమోషన్ కంటెంట్ కూడా ఎక్కడా నిరాశపర్చలేదు.ఇక ఇప్పుడు ఆ హైప్ ను మరింత పెంచేందుకు రిలీజ్ ట్రైలర్ ను కూడా వదిలారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఫ్యాకడ్ గా వచ్చిన ఈట్రైలర్ అంచనాలను పెంచేసింది.ప్రాపర్ కమర్షియల్ సినిమాతో రవితేజ ఈసారి బరిలోకి దిగుతున్నట్లే అనిపిస్తుంది.హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్లస్ అవ్వనున్నాయి.మరి ఈసినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ప్రముఖ కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ ,కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా నవదీప్,మధుబాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు.దేవ్ జాన్డ్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.ఈగల్ హిందీలో కూడా ఈనెల 9న సహదేవ్ గా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: