
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 215


తండ్రైన విశ్వంభర డైరెక్టర్ వశిష్ఠ

నెట్ ఫ్లిక్స్ లోకి సలార్ ఇంగ్లీష్ వెర్షన్

#90'S డైరెక్టర్ కు క్రేజీ ఆఫర్లు

గ్రామీ అవార్డ్స్ లో సత్తా చాటిన భారత్

కల్కి 2898 AD లో ప్రభాస్ ఇంట్రో కోసం భారీ ప్లాన్

లాల్ సలామ్ ట్రైలర్ రిలీజ్

తండేల్ కీలక షెడ్యూల్ కంప్లీట్


మరో భాషలో కూడా బేబి రీమేక్

హనుమాన్ కోసం 75 ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేశా

రాబోతున్న క్రేజీ సీక్వెల్స్ ఇవే

టిల్లు స్క్వేర్ నుండి రానున్న స్నీక్ పీక్
మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈసినిమా పలుమార్లు రిలీజ్ డేట్ ను మార్చుకున్నా ఫైనల్ గా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టికెట్టే కొనకుండా అనే పాటను అలానే రాధిక అనే పాటను రిలీజ్ చేయగా అవి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

తండ్రైన విశ్వంభర డైరెక్టర్ వశిష్ఠ
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్, 'బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి తండ్రి అయ్యారు. ఆయన సతీమణి సుజాత సోమవారం ఆడబిడ్డను ప్రసవించారు. కాగా ఈ సంతోషకరమైన వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే వశిష్ఠ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో 'విశ్వంభర' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష చిరు సరసన కథానాయికగా నటిస్తున్నారు. 18 ఏళ్ల క్రితం చిరుతో కలిసి ‘స్టాలిన్’ సినిమాలో నటించిన ఆమె.. మళ్లీ ఇన్నాళ్లకు మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్‌పై సందడి చేయనున్నారు.

ఈగల్ ఫస్ట్ రివ్యూ ఇచ్చిన రవితేజ
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.

నెట్ ఫ్లిక్స్ లోకి సలార్ ఇంగ్లీష్ వెర్షన్
సలార్ ఇంటర్నేషనల్ లాంగేజ్వ్ లోకూడా అందుబాటులోకి వచ్చింది.సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ను నెట్ ఫ్లిక్స్ గత నెలలో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.తెలుగుతోపాటుఅన్ని దక్షణాది భాషల్లో అందుబాటులోకి తీసుకురాగా నిన్న ఇంగ్లీష్ వెర్షన్ ను కూడా స్ట్రీమింగ్ లోఉంచింది.దీనికి డబ్బింగ్ కూడా సూపర్ గా చేశారు.ఇక ఇంకా హిందీ లోకూడా విడుదలకావాల్సి వుంది.నెట్ ఫ్లిక్స్ హిందీ హక్కులను కూడా దక్కించుకుంది మరి హిందీలో ఎప్పుడు స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తుందో చూడాలి.

#90'S డైరెక్టర్ కు క్రేజీ ఆఫర్లు
రీసెంట్ గా వచ్చిన #90'S అనే వెబ్ సిరీస్ సూపర్ అనిపించుకుంది.మిడిల్ క్లాస్ బయోపిక్ గా వచ్చిన ఈసిరీస్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది.దాంతో యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటిటి లో స్ట్రీమింగ్ లో వుంది.ఇక ఈవెబ్ సిరీస్ ను రియలిస్టిక్ గా తెరకెక్కించి మంచి మార్కులు కొట్టేశాడు డైరెక్టర్ ఆదిత్య హాసన్.ఓ మధ్య తరగతి కుటుంభం లైఫ్ స్టైల్ ను కళ్లకు కట్టినట్టు చూపించాడు.ఈ వెబ్ సిరీస్ ఈ డైరెక్టర్ కు ఇప్పుడు సినిమా ఆఫర్లు కూడా తీసుకొచ్చింది.

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన విష్ణు మంచు బృందం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం నటులు రఘుబాబు మరియు శివబాలాజీలతో కలిసి డిప్యూటీ సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి చిత్ర పరిశ్రమ తరుపున బహుమతిని అందజేశారు. అనంతరం ఈ భేటీ గురించి విష్ణు మంచు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అందులో.. "తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నో విషయాల మీద చర్చించాం. తెలుగు చిత్ర పరిశ్రమ తరుపున డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడాం. డ్రగ్స్ ఫ్రీ సొసైటి కోసం…

హనుమాన్... కలెక్షన్స్ లో తగ్గని జోరు
హనుమాన్ మూవీ మాత్రం తన జోరున ఎక్కడా తగ్గించేలా కనిపించట్లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ ను దుల్లగొడుతుంది. నిజానికి రిలీజ్ కు ముందు ఈసినిమా ఈ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అని అనుకోలేదు. కానీ రిలీజ్ తరువాత ఈసినిమా కొల్లగొడుతున్న రికార్డులు చూసి ఇప్పుడు అందరూ అశ్చర్యపోతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి.

గ్రామీ అవార్డ్స్ లో సత్తా చాటిన భారత్
మన ఇండియన్ సినిమాలు ఇప్పుడు అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే కదా. గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు గ్రామీ అవార్డుల్లో సైతం తమ ప్రతిభను చాటుకుంది భారత్. అంతర్జాతీయ అవార్డ్స్ లో గ్రామీ అవార్డ్స్ కు ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే కదా. సంగీతంలో సాధించిన విజయాలను గుర్తించడానికి గాను ఈ అవార్డులను ప్రధానం చేస్తుంటారు. ఇక ఈ అవార్డుల ప్రధానోత్సవం నిన్న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంతోమంది సంగీత కళాకారులు పాల్గొన్నారు.

కల్కి 2898 AD లో ప్రభాస్ ఇంట్రో కోసం భారీ ప్లాన్
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడి. ఈసినిమాను పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. దానికి తగ్గట్టుగానే ఈసినిమా డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ ఎంతో రీసెర్చ్ చేశారు.. అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకొని తీర్చిదిద్దుతున్నారు. దీనికి ఉదాహరణగా ఈసినిమా నుండి రిలీజ్ చేసిన వీడియోలను బట్టి చెప్పొచ్చు. స్క్రాచ్ నుండి టైర్ ను తయారుచేయడం, ఫస్ట్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

లాల్ సలామ్ ట్రైలర్ రిలీజ్
ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. స్పోర్ట్ బేస్డ్ ఇంకా మరియు మత కల్లోల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో రజనీకాంత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ముందు పొంగల్ కు రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ పొంగల్ కు పలు సినిమాలు రిలీజ్ కు ఉండటంతో ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఫైనల్ గా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్సే సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా…

ఫ్యామిలీ స్టార్ నుండి.. ఫస్ట్ లిరికల్ 'నందనందన' ప్రోమో రిలీజ్
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై ఆడియెన్స్‌లో ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి 'టైటిల్ లుక్‌ను రివీల్ చేస్తూ.. లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు టీజర్‌లకు నెట్టింట మంచి అప్లాజ్ వచ్చింది.

రవితేజ అన్నతో కలసి అలాంటి సినిమా చేయాలని ఆశ - నవదీప్
మాస్ మహారాజా రవితేజ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘ఈగల్’. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ మరియు కావ్య థాపర్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. నవదీప్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈగల్ టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తండేల్ కీలక షెడ్యూల్ కంప్లీట్
నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ను ఈమధ్యనే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా కీలక షెడ్యూల్ పూర్తయినట్టు తెలిపారు చిత్రయూనిట్. బ్యూటిఫుల్ విలేజ్ లో ఈసినిమా షెడ్యూల్ కంప్లీట్ అయిందని.. మెయిన్ కాస్ట్ ఈ షూటింగ్ లో పాల్గొన్నారని.. వారితో కీలక సన్నివేశాలు…

ఆపరేషన్ వాలెంటైన్ సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్
శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మార్చి 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రవితేజతో కలిసి మరిన్ని సినిమాల్లో నటించాలనుంది - అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఈగల్’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్ టాలీవుడ్ ప్రముఖ నటుడు నవదీప్ మరియు శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మరో భాషలో కూడా బేబి రీమేక్
చిన్న సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది బేబి సినిమా. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రావడంతో యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక హిట్ అయిన సినిమాలను పలు భాషల్లో రీమేక్ చేయడం అనేది ఇప్పుడు కామన్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తారని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈసినిమాను మరో భాషలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈసినిమా నిర్మాత అయిన ఎస్కేన్ ఒక సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేబి సినిమా గురించి కూడా తెలిపారు. బేబి…

ఈగల్ లో నాకు నేను విపరీతంగా నచ్చిన గెటప్‌లో కనిపిస్తాను - రవితేజ
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ ఫుల్ గా జరిగింది.

అంజాబీపేట మ్యారేజ్ బ్యాండు 3డేస్ క్రేజీ కలెక్షన్స్
టాలీవుడ్ కుర్రహీరో సుహాస్ మాత్రం సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ హిట్లు కొట్టుకుంటూ వెళుతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గరనుండి హీరోగా మారి డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. కలర్ ఫొటో, రైటర్ పద్మ భూషణ్ సినిమాలతో డీసెంట్ హిట్లను అందుకున్న సుహాస్ తాజాగా అంజాబీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సుహాస్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. దీంతో ఈసినిమా కలెక్షన్స్ కూడా సాలిడ్ గా పెరుగుతున్నాయి. ఈసినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.28 కోట్లను కలెక్ట్ చేసింది. అయితే మూడు రోజుల్లో ఈసినిమా…

హనుమాన్ కోసం 75 ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేశా
ఇప్పుడు మరో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఆసినిమా మరేదో కాదు హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా తెలుగు, హిందీతో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డుల మోత మోగిస్తుంది.

రాబోతున్న క్రేజీ సీక్వెల్స్ ఇవే
ఒక సినిమా హిట్టయిందంటే చాలు ఆ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడమో.. లేక సీక్వెల్స్ చేయడమో చేస్తుంటారు. ఇది సినీ పరిశ్రమలో ఎప్పటినుండో వస్తున్న సంప్రదాయమే. అయితే గత కొంత కాలంగా సీక్వెల్స్ కు కొంత బ్రేక్ పడినా.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో సీక్వెల్స్ సందడి మొదలైంది. స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సీక్వెల్స్ తీసే పనిలో పడ్డారు. ప్రస్తుతం చాలా సినిమాల సీక్వెల్స్ షూటింగ్ దశల్లో ఉన్నాయి. మరి రాబోతున్న క్రేజీ సీక్వెల్స్ ఏంటో ఒకసారి చూద్దాం..