వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ ఎట్టకేలకు ఓటిటి లోకి వచ్చేస్తుంది.ఎప్పుడో రావాల్సిన ఈసినిమా పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఇప్పుడు వస్తుంది.జీ 5 ఈసినిమా ఓటిటి హక్కులను దక్కించుకుంది.ఈనెల 16నుండి ది కేరళ స్టోరీని స్ట్రీమింగ్ లోకి తీసుకరానున్నామని అధికారికంగా ప్రకటించింది.అయితే హిందీతోపాటు దక్షిణాది భాషల్లో అదే రోజు స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తుందా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా వివాదాస్పదం అయ్యింది.ఈసినిమాను బ్యాన్ చెయ్యాలనే వాదనలు కూడా తెరపైకి వచ్చాయి.అయితే వీటన్నింటికి తట్టుకుకొని మేలో విడుదలైన ఈసినిమా ఎక్స్ట్రార్డినరీ థియేట్రికల్ రన్ ను సొంతం చేసుకుంది.
కేవలం 20కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈసినిమా ఏకంగా 300కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ముగ్గురు కేరళ యువతులు ఇస్లాం మతంలోకి మారి తీవ్రవాదం వైపు ఎలా మళ్లారు అనే కథాశంతో తెరకెక్కింది.ఈసినిమాలో అదా శర్మ ,సిద్ది ఇద్నాని,యోగితా బిహాని,సోనియా బలాని లీడ్ రోల్స్ లో నటించగా సుదీప్తో సేన్ డైరెక్ట్ చేశాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























