OG నుండి పవన్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

pawan kalyan powerful poster released from OG movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పవన్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో తను చేస్తున్న కొత్త సినిమాల షూటింగ్ లు అన్నీ పెండింగ్ లో ఉన్నాయి. తన నుండి కొత్త సినిమా రావాలంటే కొద్ది రోజులు మాత్రం వెయిట్ చేయక తప్పుదు ఫ్యాన్స్. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈపోస్టర్ ను చూస్తుంటే ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లు ఒక ఎత్తైతే.. ఈ పోస్టర్ మరో ఎత్తులా కనిపిస్తుంది. ఒక చేతిలో టీ గ్లాస్ పట్టుకొని మరో చేతిని జేబులో పెట్టుకొని పక్కకి చూస్తున్న పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.

ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seventeen =