సరిపోదా శనివారం.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

Saripodhaa Sanivaaram Wraps up the Crucial Second Schedule

నేచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’ తర్వాత హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అంటే సుందరానికి’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంతో మరోసారి వీరి కాంబో రిపీట్ కానుంది. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కోలీవుడ్ డైరెక్టర్ కమ్ హీరో ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపించనున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ వంటి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించిన డీవీవీ దానయ్య డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దీనిని తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వీలైనంత తొందరగా పూర్తి చేసి ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదలచేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘సరిపోదా శనివారం’ నుంచి ఒక కీలక అప్‌డేట్‌ అందించారు మేకర్స్. గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ ముగించినట్లు ప్రకటించారు. ఈ మేరకు విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సందర్భంగా హీరో నాని సహా మూవీ టీమ్ అంతా కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. కాగా ఈ షెడ్యూల్‌లో సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించామని తెలిపారు.

ఇక ఇదిలా ఉండగా.. ఇప్పటికే సరిపోదా శనివారం చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు దక్కించుకున్న విషయం తెలిసిందే. నైజాంతోపాటు ఆంధ్రా హక్కులను కూడా ఆయన ఫ్యాన్సీ రేట్‌కి దక్కించుకున్నారు. అలాగే సరిపోదా శనివారం ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడయ్యాయి. ప్రముఖ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు దక్కించుకుంది. దీనికిముందు నాని నటించిన చివరి నాలుగు సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కావడం విశేషం. ఇక నాని కెరీర్‌లో ఇదే హైయెస్ట్ ఓటీటీ డీల్ అని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =