ఆపరేషన్ వాలెంటైన్ నుండి గగనాల ఫుల్ సాంగ్ రిలీజ్

Gaganaala full song out from Operation Valentine movie

ముకుంద సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మెగా హీరో వరుణ్ తేజ్. మొదటి సినిమా అంతలా విజయం సాధింకపోయినా ఆ తరువాత ఫిదా సినిమాతో మాత్రం మంచి హిట్ ను కొట్టి ఆ తరువాత తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్ 2 ఇలా వరుస విజయాలు అందుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఈమధ్యకాలంలో సరైన హిట్ ను అందుకోలేకపోయాడు వరుణ్. గని రీసెంట్ గా రిలీజ్ అయిన గాండీవధారి అర్జున కూడా పరాజయం సొంతం చేసుకున్నాయి. దీంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా ఆపరేషన్ వేలంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మార్చి 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగానే పాటలను రిలీజ్ చేస్తున్నారు. ఈసినిమా సెకండ్ సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇప్పటికే ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. గగనాల అంటూ వచ్చే ఆపాటకు సంబంధించిన అప్ డేట్ ను నిన్న రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మెలోడియస్ గా ఉన్న ఈపాట అయితే ఆకట్టుకుంటుంది. అర్మాన్ మాలిక్ పాడిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

కాగా ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 6 =