తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ అయలాన్ ఓటిటి లోకి రానుంది.ఈనెల 9నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానున్నామని హక్కులను దక్కించుకున్న సన్ నెక్స్ట్ అధికారికంగా ప్రకటించింది.ఇక గత నెలలో పొంగల్ కు విడుదలైన ఈసినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఈసినిమా ఈనెల జనవరి 26న తెలుగులో విడుదలకావాలి.ఇందుకోసం శివ కార్తికేయన్ ప్రమోషన్స్ కూడా చేశాడు కానీ ఆర్థిక సమస్యల వల్ల చివరి నిమిషంలో విడుదల ఆగిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడూ ఎలాగూ ఓటిటి లోకి వస్తుంది కాబట్టి తెలుగు థియేట్రికల్ విడుదల లేనట్లే.రవికుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.శరద్ కెల్కర్ ,కరుణాకర్ ,యోగి బాబు కీలక పాత్రల్లో నటించారు.ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
భారీ బడ్జెట్ తో కేజేఆర్ స్టూడియోస్ నిర్మించింది.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో విఎఫ్ఎక్స్ సూపర్ అనిపించింది.ఏలియన్ తో కలిసి హీరో ఏం చేశాడనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈసినిమా.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: