సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఉంటుంది రౌడీహీరో విజయ్ దేవరకొండ క్రేజ్. నిజానికి విజయ్ కు సాలిడ్ హిట్ పడి చాలా కాలమే అవుతుంది. ఈమధ్య ఖుషి సినిమా రిలీజ్ అయింది కానీ ఆ సినిమా నార్మల్ హిట్ అయింది కానీ ఆశించినంత స్థాయి రెస్పాన్స్ రాలేదని చెప్పొచ్చు. అయినా కూడా విజయ్ కు మాత్రం అవకాశాలకు ఢోకా లేదు. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. అందులో ఫ్యామలీ స్టార్ సినిమా ఒకటి. పరశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. నందనందన అంటూ రానున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమోను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రోమో కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. క్యాచీ ట్యూన్ తో ఉన్న ఈపాట అయితే ఆకట్టుకుంటుంది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా.. ప్రముఖ సింగర్ సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు.
The VIBE begins now 💥#NandaNandanaa Full song out now ❤️https://t.co/z0XKrZXZN5#FamilyStar#FamilyStarOnApril5th @TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @sidsriram @IananthaSriram @SVC_official @TSeries @tseriessouth
— Sri Venkateswara Creations (@SVC_official) February 7, 2024
కాగా ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: