కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 213

Mahesh Babu's Guntur Kaaram Streaming in OTT Now
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన గుంటూరు కారం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వ‌చ్చిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘గుంటూరు కారం’ అత‌డు, ఖ‌లేజా సినిమాల త‌ర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా రావ‌డంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రిలీజ్‌కు ముందే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా.. అందుకు తగ్గట్లుగా సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అనిపించుకుంది. దాదాపు 250 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
gopichand bhimaa movie first single yedo yedo maaya song promo out
సాంగ్

భీమా ఫస్ట్ సింగిల్ ఏదో ఏదో మాయ ప్రోమో రిలీజ్

కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమా భీమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా పడి శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి8వ తేదీన రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
last 40-minutes will be next level in eagle
సినిమా వార్తలు

ఈగల్ లో లాస్ట్ 40నిమిషాలు .. బ్లాస్ట్

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్ మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్స్ భారీగా చేశారు.హైప్ కూడా వచ్చింది.రవితేజ అయితే సినిమా విజయం ఫై కాన్ఫిడెంట్ గా వున్నాడు.బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పెద్దది ఏం కాదు.23కోట్ల షేర్ రాబడితే చాలు.హిట్ టాక్ వస్తే ఈ టార్గెట్ కేక్ వాకే. ముఖ్యంగా సినిమాలో చివరి 40నిమిషాలు అదిరిపోయిందట.

Mahender Reddyవాట్సాప్
prasanth varma solid counter to hanuman negativity
సినిమా వార్తలు

హనుమాన్ నెగిటివిటీ పై డైరెక్టర్ సాలిడ్ కౌంటర్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా తెలుగు, హిందీతో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డుల మోత మోగిస్తుంది.

TFN Adminవాట్సాప్
karthik gattamneni shares interesting facts about eagle movie
సినిమా వార్తలు

ఈగల్ కాన్సెప్ట్ లోనే విధ్వంసం వుంది-కార్తీక్ ఘట్టమనేని

మాస్ మహారాజా రవితేజ నటించిన మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
Balagam Director Venu Yeldandi Emotional Post on His Father Goes Viral
సినిమా వార్తలు

బ‌ల‌గం డైరెక్టర్ వేణు యెల్దండి ఎమోష‌న‌ల్ పోస్ట్

టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్‌రాజు వారసులైన హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా దిల్‌రాజు ప్రొడక్షన్స్‌, శిరీష్‌ సమర్పణలో నిర్మించిన సినిమా 'బలగం'. బర్దస్త్‌ షో సహా పలు సినిమాలలో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. పూర్తి గ్రామీణ వాతావరణంలో రూపొందిన ఈ సినిమా తెలంగాణ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కింది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో వేణు ఒక క్యామియో రోల్‌లో కనిపించగా.. మురళీధర్ గౌడ్‌, జయరామ్‌, రూప, రచనా రవి కీలక పాత్రల్లో కనిపించారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 shooting goes on at brisk pace
షూటింగ్ అప్‌డేట్

పుష్ప 2 స్పీడ్ పెరిగింది

ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా వస్తుంది పుష్ప ది రూల్.హిట్ టాక్ వస్తే 1000కోట్లు కొల్లగొట్టే సత్తా ఉన్నసినిమా.కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోనూ సూపర్ క్రేజ్ వుంది.ఈసినిమాను ఆగస్టు 15న విడుదలచేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.అయితే అదే డేట్ కు రాకపోవచ్చు అని వార్తలు కూడా వచ్చాయి కానీ నిర్మాతలు పదే పదే క్లారిటీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో సినిమాను అదే డేట్ కు తీసుకువస్తామని చెప్పేశారు.

Mahender Reddyవాట్సాప్
Tillu Square Glimpse gets extraordinary response
ట్రైలర్ & టీజర్

టిల్లు స్క్వేర్ గట్టిగానే వర్కౌట్ అయ్యేలావుంది

డీజే టిల్లు తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.రెండేళ్ల క్రితం విడుదలైన ఈసినిమా బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతుంది.టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో వస్తున్నఈసినిమాలో సిద్దుకు జోడీగా అనుపమా పరమేశ్వరన్ నటిస్తుండగా మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఆల్మోస్ట్ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఈసినిమానుండి నిన్న సిద్దూ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
animal movie available in english language too
సినిమా వార్తలు

యానిమల్ ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా

సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన వయోలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాలో మరోసారి తన సత్తా చూపించాడు సందీప్ వంగా. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Vennela Kishore's Chaari 111 Release Date Fixed
రిలీజ్ అప్‌డేట్

వెన్నెల కిశోర్ 'చారి 111' రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ కమెడియన్స్‌లో ‘వెన్నెల’ కిశోర్ శైలి డిఫరెంట్. సినిమాల్లో కథానాయకుడి పాత్రధారి పైనా సెటైర్స్ వేయగల స్థాయి ఉన్న నటుడు ఆయన. అమాయకత్వం, వ్యంగ్యం కలగలిసిన వినోదానికి వెన్నెల కిశోర్ కేరాఫ్ అడ్రస్. తన డిఫరెంట్ మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ఆయన ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతారు. ఇక ఇదిలా ఉండగా.. వెన్నెల‌ కిశోర్ ఇటీవలే వెన్నెల కిశోర్ తేజ సజ్జా హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ 'హ‌నుమాన్‌'లో ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అలాగే ఆయన ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న 'గేమ్ ఛేంజ‌ర్‌' మరియు 'ఇండియ‌న్ 2' సినిమాలలో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
jayam ravi siren movie trailer out now
ట్రైలర్ & టీజర్

జయంరవి సైరెన్ ట్రైలర్ రిలీజ్

ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా వస్తున్న సినిమా సైరెన్ 108. అన్నాత్తే, విశ్వాసం, హీరో సినిమాలకు రచయితగా పనిచేసిన ఆంటోని ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రివేంజ్ డ్రామాగా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
Dil Raju's Brother Shirish and Family Members Invited Ram Charan For Ashish Wedding
సినిమా వార్తలు

దిల్ రాజు ఇంట వివాహం.. రామ్ చరణ్‌కు ఆహ్వానం

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు ఇంట త్వరలో శుభకార్యం జరగబోతునున్న విషయం తెలిసిందే. ఆయ‌న సోద‌రుడు శిరీష్ తనయుడు, యంగ్ హీరో ఆశిష్ వివాహం ఈ నెలలో జరుగనుంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు గత వారం రోజులుగా సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను క‌లిసి ఆహ్వాన పత్రిక అంద‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా దిల్ రాజు కుటుంబసభ్యులు టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను కలిశారు.

Srikanth Mవాట్సాప్
gautham krishna new movie title and first look revealed
బిగ్ బాస్

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా కొత్త సినిమా

బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ చూసినవారందరికీ గౌతమ్ సుపరిచితుడే. తన బిహేవియర్ తో ముక్కుసూటి తనంతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ కు రాకముందు గౌతమ్ పలు షార్ట్ ఫిలింస్ లలో నటించిన సంగతి తెలిసిందే కదా. అయితే వాటి ద్వారా గౌతమ్ కు అంత గుర్తింపు రాలేదనే చెప్పొచ్చు. ఇక ఈసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
gangs of godavari release postponed
సినిమా వార్తలు

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరో సారి వాయిదా

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల తేదీ మరో సారి మారనుంది.గత ఏడాది చివర్లోనే ఈసినిమాను విడుదలచేస్తామని నిర్మాతలు ప్రకటించారు కానీ అప్పటికీ వర్క్స్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడింది.ఇక శివరాత్రికి మార్చి 8న విడుదలచేస్తామని రీసెంట్ గా అనౌన్స్ చేశారు.ఇక ఇప్పుడు ఈడేట్ కు కూడా రావడం లేదు.

Mahender Reddyవాట్సాప్
chandoo mondeti shares interesting post on naga chaitanya
సినిమా వార్తలు

తండేల్ రాజు డెడికేషన్ తెరపై చూడాల్సిందే

నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Mohan Babu Offered Blessings to the Newly Engaged Couple Ashish and Advitha Reddy
సినిమా వార్తలు

ఆశిష్, అద్వైత జంటను ఆశీర్వదించిన మోహన్ బాబు

టాలీవుడ్ అగ్ర నిర్మాత‌, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు ఇంట త్వరలో శుభకార్యం జరుగనున్న విషయం తెలిసిందే. ఆయ‌న సోద‌రుడు శిరీష్ తనయుడు, యంగ్ హీరో ఆశిష్ వివాహం ఈ నెలలో జరుగనుంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు గత వారం రోజులుగా సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను క‌లిసి ఆహ్వాన పత్రిక అంద‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా దిల్ రాజు కుటుంబసభ్యులతో కలిసి టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహ‌న్‌బాబు ఇంటికి వెళ్లి శుభలేఖ అంద‌జేశారు.

Srikanth Mవాట్సాప్
vishwak sen shares interesting facts about gaami movie
సినిమా వార్తలు

గామి అద్భుతమైన అనుభూతిని పంచుతుంది- విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌, విద్యాధర్ కాగిట దర్శకత్వంలో చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'గామి'. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గామి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం గ్రాండ్ గా ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

TFN Adminవాట్సాప్
Actress Varsha Bollamma Reveals Interesting Facts About Ooru Peru Bhairavakona
సినిమా వార్తలు

ఊరు పేరు భైరవకోన.. ఆడియెన్స్‌కి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది - వర్ష బొల్లమ్మ

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్‌లో నిర్మించగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు…

Srikanth Mవాట్సాప్
siddhu jonnalagadda birthday glimpse out from tillu square movie
ట్రైలర్ & టీజర్

టిల్లు స్క్వేర్ బర్త్ డే గ్లింప్స్ రిలీజ్

చిన్న పాత్రలు చేసుకుంటూ ఆ తరువాత హీరోగా చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సిద్దూ జొన్నలగడ్డ. డీజే టిల్లు సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన సిద్దూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో టిల్లు స్క్వేర్ సినిమా ఇంకా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలు ఉన్నాయి. వీటిలో టిల్లు స్క్వేర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో రాబోతుంది. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈసినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Siddhu Jonnalagadda motion poster released from Telusu kada movie
ఫస్ట్ లుక్

తెలుసు కదా నుండి సిద్దూ మోషన్ పోస్టర్ రిలీజ్

సిద్దూ జొన్నలగడ్డ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో నీరజ కోన దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా కూడా ఉంది. నీరజ కోన దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటివరకూ స్టైలిష్ గా పనిచేసిన నీరజ ఈసినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతుంది. తెలుసు కదా అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఇక నేడు సిద్దూ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమాల నుండి అప్ డేట్లు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి సిద్దూ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మోషన్ పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్