యానిమల్ థియేటర్లలోనే కాదు ఓటిటి లోనూ రికార్డులు క్రీయేట్ చేస్తుంది.గత ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 800కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఇక రెండు వారాల క్రితంఓటిటి లో విడుదలై వ్యూస్ పరంగా ఆల్ టైం రికార్డు సృష్టించింది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొని రాగ 39.3 మిలియన్ వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకుంది.దాంతో అత్యధిక వ్యూయర్ షిప్ ను రాబట్టిన సినిమాగా యానిమల్ రికార్డు క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకుముందు 10రోజుల్లో ఆర్ఆర్ఆర్ 25.5కోట్ల వ్యూయర్ షిప్ ను రాబట్టగా జవాన్ 11రోజుల్లో 25.5 కోట్ల వ్యూయర్ షిప్ ను రాబట్టాయి.ఇప్పుడు యానిమల్ ఈరెండుని క్రాస్ చేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.ఇక సలార్ కూడా మంచి వ్యూయర్ షిప్ నే సొంతం చేసుకుంది.కాకపోతే హిందీ వెర్షన్ రిలీజ్ కాలేదు కాబట్టి యానిమల్ కు పోటీనివ్వలేకపోయింది.
ప్రస్తుతం యానిమల్ ఇండియాలో మొదటి స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుండగా గ్లోబల్ వైడ్ గా మూడో స్థానంలో వుంది.కబీర్ సింగ్ తరువాత సందీప్ రెడ్డి వంగ – రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా అనిల్ కపూర్,బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు.హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు.టీ సిరీస్ ,భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: