సెన్సార్ పూర్తిచేసుకున్న లాల్ సలామ్

lal salaam movie completes censor formalities

ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. ఓ క్రికెట్ మ్యాచ్ ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసిన తీరు, తర్వాత వాటి వల్ల ఓ గ్రామం ఎదుర్కొన్న సంఘర్షణ ఆధారంగా లాల్ సలామ్ మూవీని రూపొందించారు. ఈసినిమాలో రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొయిద్దీన్ భాయ్‌గా ర‌జినీకాంత్ కనిపించనున్నారు. ఈసినిమా పొంగల్ కే రిలీజ్ అవ్వాలి కానీ పొంగల్ కు పలు సినిమాలు లిస్ట్ లో ఉండటంతో ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ ను అందించారు సెన్సార్ సభ్యులు. అంతేకాదు ఇక ఈ మూవీ రన్ టైమ్ ను 2 గంటల 32 నిమిషాలకు లాక్ చేశారు.

ఇంకా ఈసినిమాలో జీవిత రాజశేఖర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. రజనీకాంత్ సోదరి పాత్రలో నటిస్తుంది. చాలా కాలం తరువాత జీవిత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 7 =