సిద్దు-బొమ్మరిల్లు భాస్కర్ మూవీ టైటిల్ రిలీజ్

siddhu jonnalagadda and bommarillu bhaskar movie title released

గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. టిల్లూ స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో కూడా సిద్దూ జొన్నలగడ్డ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాలో హీరోయిన్ గా బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. ఈసినిమాకు జాక్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కొంచం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. అంతేకాదు మోషన్ పోస్టర్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. రెండు చేతుల్లో రెండు తుపాకీలను పట్టుకున్నాడు సిద్దూ. మోషన్ పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =