కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి ఎంటరైన విషయం తెలిసిందే. ఆయన తన పార్టీ పేరును ‘తమిళగ వెట్రి కళగం’ అని ప్రకటించారు. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీపై తమిళనాట పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే, ఇప్పటికే అక్కడ రజనీకాంత్ లాంటి దిగ్గజ హీరో పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేయడం, ఆ తర్వాత వెనకడుగు వేయడం, అలాగే మరో ప్రముఖ హీరో కమల్ హాసన్ కూడా ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీని స్థాపించి క్రితం ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం ప్రజలు చూశారు. ఈ క్రమంలో విజయ్ రాజకీయాల్లోకి రావడంపై ఒక్కొక్కరూ ఒక్కో రకంగా వ్యాఖ్యానిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో దళపతి విజయ్ రాజకీయాల్లోకి రావడంపై తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆమె విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. “విజయ్ సినిమాపై ఇప్పటికే తనదైన ముద్ర వేశారు. తన నటన ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. అలాగే ఆయన ఇప్పుడు ప్రజలకు సేవ చేయడంలో భాగంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇది చాలా గొప్ప నిర్ణయం, అభినందించాల్సిన విషయం” అని పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: