టాలీవుడ్ యంగ్ నటుడు విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో గామి సినిమా కూడా ఒకటి. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా వస్తోన్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. నిజానికి ఈసినిమాను ఎప్పుడో ప్రారంభించారు. కానీ ఈసినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో ఇప్పటివరకూ రిలీజ్ కాలేకపోయింది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనలను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి బిగ్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దీంతో ఫ్యాన్స్ ఆ బిగ్ అప్ డేట్ ఏమై ఉండొచ్చు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా చెప్పినట్టే బిగ్ అప్ డేట్ ను ఇచ్చారు. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. మార్చి8వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా ఈసినిమా మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. 2018 లో ఈసినిమా కోసం క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేశామని.. 2021లో యూవీ క్రియేషన్స్ వారు పెద్ద సపోర్ట్ తో వచ్చారని.. తెలుపుతూ ఈసినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలిపారు.
కాగా ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























