నెపోటిజం (బంధుప్రీతి).. ఇటీవల ఈ మాట తరచుగా వినిపిస్తోంది. నిజానికి ప్రతీ ఒక్క రంగంలో వారసత్వం అనేది సహజంగా ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీ మరియు రాజకీయ రంగాల్లో ఇది ఇంకొంచెం ఎక్కువగా వినపడుతోంది. దానికి కారణం మీడియా ఫోకస్ ఎప్పుడూ వీరిపై ఉంటుంది. సినిమా పరిశ్రమ విషయానికొస్తే.. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హీరోల నుంచి టెక్నీషియన్స్ వరకూ ఎంతోమంది వారసులు కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలోని వ్యక్తులు దీనిని అంత పెద్ద విషయంగా భావించరు. కానీ బయటి ప్రపంచానికి మాత్రం ఇది అసాధారణ విషయంగా కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎందుకంటే..? అప్పటికే స్టార్‌డమ్ సొంపాదించుకున్నవారు వారి వారసులకు అండగా ఉంటారని, అలాగే అవకాశాలకోసం ప్రయత్నించే ఉత్సాహవంతులైన వారికి ఈ అవకాశం ఉండదని అనుకుంటుంటారు. దీంతో ఈ నెపోటిజంపై చాలా చర్చలు, కాంట్రవర్సీలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఫిల్మ్ మేకర్స్ కూడా నెపోటిజంకే సపోర్ట్ చేస్తారని, బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చే వారిని అస్సలు పట్టించుకోరని సాధారణ ప్రేక్షకులు ఫీల్ అవుతుంటారు. దీనికితోడు స్వయంకృషితో పైకొచ్చిన పలువురు సెలబ్రిటీలు సైతం తాము కూడా దీనిని ఎదుర్కొన్నామని అడపాదడపా ఓపెన్‌గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా నెపోటిజంపై స్టార్ హీరోయిన్, ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ స్పందించింది. కొందరు స్టార్ వారసులను ఉదాహరిస్తూ నెపోటిజంపై ఆమె తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఒక ఇంటర్వ్యూలో భాగంగా మృణాల్ నెపోటిజం వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఓ అవార్డుల వేడుకలో నేను మీడియాతో మాట్లాడుతున్నా. అదే సమయంలో అక్కడికి ఒక స్టార్ కిడ్ వచ్చింది. వెంటనే మీడియా మొత్తం నన్ను మధ్యలోనే వదిలేసి ఆమె దగ్గరికి పరుగులు పెట్టింది” అని తెలిపింది.
ఇంకా మృణాల్ ఇలా చెప్పింది.. “అయితే ఇందులో ఆ స్టార్ కిడ్ చేసిన తప్పేమీ లేదు. కానీ మీడియా అలా చేయడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వాస్తవానికి నెపోటిజం గురించి అందరూ మాట్లాడతారు. కానీ దానిని ప్రోత్సాహిస్తున్నది ఎవరో కూడా తెలుసుకోవాలి. నెపోటిజం విషయమై స్టార్ కిడ్స్ ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టార్ డమ్ ఉన్న వ్యక్తులకు పుట్టడం వారి తప్పెలా అవుతుంది? ప్రతి ఒక్క ప్రేక్షకుడు స్టార్ కిడ్స్ ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కాబట్టే మీడియా కూడా అలాంటి వార్తలే రాస్తుంది” అని పేర్కొంది.
అయితే గతంలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కూడా నెపోటిజంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు సినిమా రిలీజ్ అయితే లక్షల మంది ఆడియన్స్ థియేటర్లకు వెళతారని, అదే తన సినిమాకి అంతమంది ప్రేక్షకులు రారని అన్నారు. అలాగే నెపోటిజం ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీస్ లో లేదని, వారిని ఆదరిస్తున్న ఆడియన్స్ లోనే ఉందని కూడా వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో తాజాగా నెపోటిజంపై మృణాల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మృణాల్ ఠాకూర్ వ్యాఖ్యలను చాలామంది నెటిజెన్లు సమర్థిస్తుండటం గమనార్హం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: