కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 211

hari hara veera mallu surprising update on VFX work
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు టీమ్ సర్ ప్రైజింగ్ అప్ డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈసినిమా కోసం పవన్ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కొంచం పెండింగ్ లో ఉంది.

TFN Adminవాట్సాప్
Eagle Success Meet Harish Shankar Interesting Comments on Movie Reviews
సినిమా వార్తలు

ఈగల్ సక్సెస్ మీట్‌.. హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల పేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈగల్ మేకర్స్ పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ని నిర్వహించారు. కాగా ఈ వేడుకలో బివిఎస్ రవి, మణిబాబు…

Srikanth Mవాట్సాప్
Baby The Movie Grand Re-Release this FEB 14th
సినిమా వార్తలు

రీ రిలీజ్ కానున్న బేబి

గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి కల్ట్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది బేబి.ఈసినిమా 75కోట్ల వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా బయ్యర్ల కు భారీ లాభాలను తీసుకొచ్చింది.ఆనంద్ దేవరకొండ ,వైష్ణవి చైతన్య ,విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈసినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేయగా ఎస్ కె ఎన్ నిర్మించాడు.

Mahender Reddyవాట్సాప్
Producer Anil Sunkara Praises Sundeep Kishan at Ooru Peru Bhairavakona Press Meet
సినిమా వార్తలు

ఈ సినిమాతో సందీప్ కిషన్ నెక్స్ట్ రేంజ్‌కి వెళ్తాడు - అనిల్ సుంకర

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
ruhani sharma poster out from Operation Valentine movie
ఫస్ట్ లుక్

ఆపరేషన్ వాలెంటైన్ నుండి రుహానీ శర్మ ఇంట్రో పోస్టర్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమాను మార్చి1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే వరుసగా అప్ డేట్లతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను పలు పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా ఈసినిమాలో నటిస్తున్న మరో పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్…

TFN Adminవాట్సాప్
Guntur Kaaram is currently trending on Netflix
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ లో గుంటూరు కారం హవా

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం గత వారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైయింది.తెలుగు తోపాటు హిందీ,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తుండగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.తెలుగు వెర్షన్ ట్రెండింగ్ లో మొదటి స్థానంలో కొనసాగుతుండగా హిందీ వెర్షన్ మూడో స్థానం లో తమిళ వెర్షన్ ఐదో స్థానంలో కొనసాగుతుంది.దాంతో థియేటర్లలోనే కాదు ఓటిటి లోకూడా ఈసినిమాకు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Mahender Reddyవాట్సాప్
Harom Hara Movie First Single Release Date
రిలీజ్ అప్‌డేట్

హరోం హర ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

మొదటినుండీ సుధీర్ బాబు కూడా కాస్త డిఫరెంట్ సినిమాలే చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుండేవాడు. కొన్ని మంచి విజయం సాధించగా.. కొన్ని మాత్రం పరాజయాలే అందించాయి. అయినా కూడా సుధీర్ బాబు జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరోం హర సినిమా కూడా ఒకటి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
Sundeep Kishan Reveals Interesting Facts About Ooru Peru Bhairavakona
సినిమా వార్తలు

ఊరు పేరు భైరవకోన.. నాకు చాలా స్పెషల్ మూవీ - సందీప్ కిషన్

యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్‌లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Ravi Teja Thanks To Audience For Grand Success of Eagle Movie
సినిమా వార్తలు

కాళికాదేవి ఎపిసోడ్‌లో నన్ను నేను నమ్మలేకపోయాను - రవితేజ

మాస్ మహారాజా రవితేజ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై అన్ని వర్గాల పేక్షకులని అలరించి పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈగల్ మేకర్స్ పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ని నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
hanuman cross 50cr mark in hindi
సినిమా వార్తలు

హిందీలో హనుమాన్ 50కోట్లు

హనుమాన్ హిందీలో 50కోట్ల నెట్ మార్క్ ను చేరుకుంది.మొదటి వారం 22.92కోట్లు రెండో వారం 16.67,మూడో వారం 6.47,నాలుగో వారం 3.68 నెట్ వసూళ్లను రాబట్టగా ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చి మూడు రోజుల్లో 1.02కోట్ల నెట్ తో 50.76కోట్ల నెట్ ను ఖాతాలో వేసుకుంది దాంతో హిందీలో అత్యధిక వసూళ్ల రాబట్టిన దక్షిణాది సినిమాల జాబితాలో హనుమాన్ 10వ స్థానాన్నిదక్కించుకుంది.ఈ జాబితాలో బాహుబలి 2,కెజియప్ 2,ఆర్ఆర్ఆర్,రోబో 2.0,సలార్ ,సాహో,బాహుబలి,పుష్ప,కాంతారా వరుస స్థానాల్లో కొనసాగుతున్నాయి.ఇక ఈసినిమాకు సూపర్ రెస్పాన్స్ రావడంతో జై హనుమాన్ కు ప్లస్ అవ్వనుంది.హనుమాన్ కు ఈ సినిమా సీక్వెల్ గా రానుంది దాంతో హిట్ టాక్ వస్తే ఈజీగా…

Mahender Reddyవాట్సాప్
sukumar candid click from pushpa 2 the rule movie set
సినిమా వార్తలు

పుష్ప 2 సెట్ లో సుకుమార్ క్లిక్

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో అల్లు అర్జున్ నుండి వస్తున్న పుష్ప2 సినిమా కూడా ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాను ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదన్న క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇక ఆ దిశగానే షూటింగ్ ను కూడా చాలా స్పీడుగా పూర్తిచేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేస్తున్నారు మేకర్స్. ఇక ఇదిలా ఉండగా తాజాగా షూటింగ్ సెట్ నుండి తీసిన సుకుమార్ క్యాండిడ్ క్లిక్ ను హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేశారు. సింహం విగ్రహం పై కాస్త ఒరిగి ఉన్న…

TFN Adminవాట్సాప్
Samyuktha Menon Learning Horse Riding For Swayambhu
సినిమా వార్తలు

స్వయంభూ కోసం.. హార్స్ రైడింగ్ నేర్చుకుంటోన్న సంయుక్త మీనన్

టాలీవుడ్ హీరో నిఖిల్ తన 20వ చిత్రంగా 'స్వయంభూ' అనే సోషియో ఫాంటసీగా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన లెజెండరీ యోధుడి పాత్రను పోషించనున్నాడు. ఈ నేపథ్యంలో నిఖిల్ ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అద్భుతమైన వార్ సీక్వెన్సులు ఉండే ఈ సినిమాలో అన్ బిలీవబుల్ స్టంట్స్ చేయడానికి సిద్దమయ్యాడు. ఇక అతనితో పాటు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంయుక్త మీనన్ కూడా కథ ప్రకారం, ఇందులో కొన్ని స్టంట్స్ చేయనుంది.

Srikanth Mవాట్సాప్
raviteja eagle movie 3 days worldwide collections
బాక్సాఫీస్

ఈగల్ 3డేస్ సాలిడ్ కలెక్షన్స్

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన సినిమా ఈగల్. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈసినిమా పోటీ నుండి తప్పుకొని సింగిల్ రిలీజ్ ను ఫిక్స్ చేసుకొని ఫైనల్ గా ఫిబ్రవరి9వ తేదీన రిలీజ్ అయింది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా రవితేజ మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూాడా ఈసినిమా మంచి కలెక్షన్సే రాబట్టుకుంటుంది. మొదటిరోజే ఈసినిమా దాదాపు 12కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఫస్ట్ వీకెండ్ ముగిసింది. ఈ మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 30కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం…

TFN Adminవాట్సాప్
nag ashwin interesting post on vishwaksens gaami movie
సినిమా వార్తలు

గామి మూవీ పై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాను మొదలుపెట్టి దాదాపు నాలుగేళ్లు అయిపోయింది. ఎంతో కష్టపడి ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి8వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈసినిమా మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసిన సంగతి విదితమే కదా. మేకింగ్ వీడియోకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. కిష్టమైన వాతావరణ పరిస్థితిల్లో ఎలా మేకింగ్…

TFN Adminవాట్సాప్
hero sharwanand praises on ram charan
సినిమా వార్తలు

చరణ్ పై శర్వా ప్రశంసలు-నాకు స్నేహితుడు కావడం గర్వకారణం

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో పేరు సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో…

TFN Adminవాట్సాప్
sujeeth and thaman deep discussion for OG movie
సినిమా వార్తలు

OG డీప్ మ్యూజిక్ డిస్కషన్స్

పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగింది. ఈసినిమా షూటింగ్ అయితే ఎప్పుడో మొదలైంది. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుది. ప్రస్తుతం అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్
Ram Gopal Varma Announced Release Dates of Vyooham and Shapadham Movies
రిలీజ్ అప్‌డేట్

వ్యూహం, శపథం.. రిలీజ్ డేట్స్ ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కి 'వ్యూహం' అని, సెకండ్ పార్ట్‌కి 'శపథం' అని ఇప్పటికే పేర్లను కూడా ఖరారు చేశారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌లో దాసరి కిరణ్ కుమార్ వీటిని నిర్మిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. ఈ క్రమంలో తాజాగా ఈ రెండు సినిమాలకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
mahesh babu lovely post on his marriage anniversary
సినిమా వార్తలు

పెళ్లి యానివర్శిరీపై మహేష్ లవ్లీ పోస్ట్

టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ల పేర్లు ఎప్పుడూ ముందుంటాయి. మహేష్-నమ్రత ను చూసిన వారు లవబుల్ కపుల్ అంటూ కామెంట్ చేస్తుంటారు. 2000వ సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమాలో మహేష్, నమ్రత కలిసి నటించారు. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి 2005 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహబంధానికి నేటితో 19ఏళ్లు పూర్తయింది.

TFN Adminవాట్సాప్
director maruthi funny counter to netizen
సినిమా వార్తలు

సినిమా అప్ డేట్లపై మారుతి ఫన్నీ కౌంటర్

ఈమధ్య డైరెక్టర్లు కూడా సోషల్ మీడియాలో ఏ మాత్రం తగ్గట్లేదు. వారు కూడా నెటిజన్లకు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ మారుతి కూడా తన ట్విట్టర్ ద్వారా ఒక నెటిజన్ కు ఫన్నీ కౌంటర్ ఇచ్చారు. అసలు సంగతేంటంటే.. మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్నా రవి ప్రధాన పాత్రలలో వచ్చిన సినిమా ‘ట్రూ లవర్’. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో లవ్ స్టోరీగా ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమాను తెలుగులో డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా ట్రూ లవర్ సినిమాకు పోదామని థింకింగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ అని అడుగగా దానిని ట్యాగ్ చేస్తూ మారుతి ఫ్రెండ్స్ ను కూడా…

TFN Adminవాట్సాప్
Mahesh Babu's Daughter Sitara Ghattamaneni Targeted by Cyber Fraudsters
సినిమా వార్తలు

మహేష్ తనయ సితార పేరిట సైబర్ మోసాలు.. పోలీసులకు ఫిర్యాదు

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రోజురోజుకీ అడ్వాన్స్ అవుతోంది. అయితే దీనిని మంచిపనులకు వినియోగిస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. మనుషులకు ఉపయుక్తంగా ఉండాల్సిన ఈ టెక్నాలజీని కొందరు తమ స్వార్ధాలకు వాడుకుంటున్నారు. ఇటీవలికాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణ వ్యక్తులనుంచి ప్రముఖులు సైతం ఈ మోసాల బారినపడి నష్టపోతున్నారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి టాలీవుడ్ ఇండస్ట్రీలో చోటుచేసుకుంది. సైబర్ మోసగాళ్లు ఎంచుకుంది ఎవరో కాదు.. ఏకంగా టాలీవుడ్ లోని అగ్రహీరో కుటుంబాన్నే టార్గెట్ చేశారు ఈ కేటుగాళ్లు.

Srikanth Mవాట్సాప్

షేర్