కాళికాదేవి ఎపిసోడ్‌లో నన్ను నేను నమ్మలేకపోయాను – రవితేజ

Ravi Teja Thanks To Audience For Grand Success of Eagle Movie

మాస్ మహారాజా రవితేజ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై అన్ని వర్గాల పేక్షకులని అలరించి పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈగల్ మేకర్స్ పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ని నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. “ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌కు చాలా ఆనందంగా వుంది. నా పాత్ర మేకోవర్‌కి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. కార్తిక్ ఈ కథ చెప్పినప్పుడే ఆ క్యారెక్టర్‌కి చాలా ఎక్సయిట్ అయ్యాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అభినందనలు. హరీష్ శంకర్‌తో వచ్చే ‘మిస్టర్ బచ్చన్‌’తో హ్యాట్రిక్ కొడుతున్నాం. డేవ్ జాండ్ సౌండ్ ఇరగదీశాడు. తనకి చాలా మంచి భవిష్యత్ వుంటుంది. అలాగే మణి చాలా పవర్‌ఫుల్ మాటలు రాశాడు. తన పద ప్రయోగం చాలా బావుంది” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన ఇలా అన్నారు.. “హీరోయిన్ కావ్య థాపర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. తనకి బ్రైట్ ఫ్యూచర్ వుంటుంది. కాళికాదేవి ఎపిసోడ్ అయితే నన్ను నేను నమ్మలేకపోయాను. ఎవరినో చూస్తున్న అనుభూతి కలిగింది. చాలా అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి. కార్తిక్ అద్భుతమైన విజన్ కలిగిన దర్శకుడు. చెప్పినదాని కంటే అద్భుతంగా తీశాడు. తను టాప్ డైరెక్టర్ అవుతాడు. అనుపమ, అజయ్ ఘోష్, వినయ్ రాయ్ అందరూ తమ పాత్రలని పర్‌ఫెక్ట్‌గా చేశారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు” అని తెలిపారు హీరో రవితేజ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + sixteen =