ఊరు పేరు భైరవకోన.. నాకు చాలా స్పెషల్ మూవీ – సందీప్ కిషన్

Sundeep Kishan Reveals Interesting Facts About Ooru Peru Bhairavakona

యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్‌లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం ఫిబ్రవరి16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “ఊరు పేరు భైరవకోన లాంటి అద్భుతమైన చిత్రాన్ని నాకు ఇచ్చిన దర్శకులు విఐ ఆనంద్ గారికి థాంక్స్. దాదాపు రెండున్నరేళ్ళ పాటు ఈ సినిమా కోసం నిరంతరం కష్టపడ్డారు. ఆయన మొదటి సినిమా కూడా నాతోనే చేయడం గర్వంగా భావిస్తాను. అనిల్ సుంకర గారితో ఎంతో మంచి అనుబంధం వుంది” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “”సాధారణంగా నిర్మాతగా ఆయన పేరు వేసుకోరు. కానీ నేను పట్టుపట్టి ‘నిను వీడని నీడను నేను’ సినిమాకి వేశాను. అది మాకు చాలా కలిసొచ్చింది. రాజా ‘హాస్య మూవీస్’ నా హోం బ్యానర్ లాంటింది. ఊరు పేరు భైరవకోన చాలా స్పెషల్ మూవీ. ఫాంటసీ, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ వున్న మంచి కమర్షియల్ తెలుగు సినిమా ఇది. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాం. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. నాకు ఎప్పుడూ అండగా వుండే ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =