ఈగల్ సక్సెస్ మీట్‌.. హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Eagle Success Meet Harish Shankar Interesting Comments on Movie Reviews

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల పేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈగల్ మేకర్స్ పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ని నిర్వహించారు. కాగా ఈ వేడుకలో బివిఎస్ రవి, మణిబాబు, శ్రీనివాస్ అవసరాల, ప్రణీత, డేవ్ జాండ్, మిగతా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే రవితేజతో ప్రస్తుతం ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “ఈగల్ అద్భుతమైన చిత్రం. మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇలాంటి పాయింట్‌ని ఇంత స్టయిల్‌గా తీయడం కార్తిక్కే సాధ్యపడింది. డేవ్ జాండ్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. ధమాకా, ఈగల్, ప్రస్తుతం నేను చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ ఇలా మూడు డిఫరెంట్ సినిమాలు రవితేజ గారికి అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి ధన్యవాదాలు. కార్తిక్ మైండ్ బ్లోయింగ్ టేకింగ్‌తో ప్రపంచం అంతా మెచ్చుకునేలా సినిమా తీశాడు” అని అన్నారు.

ఇక రవితేజతో తాను తీస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా గురించి వివరిస్తూ.. “ఆదివారంతో ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఇందులో రవితేజ పూర్తి భిన్నమైన లుక్‌తో కనిపిస్తారు. ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమాగా రూపొందిస్తున్నా. ఇంతకుముందు మా కాంబోలో వచ్చిన ‘మిరపకాయ్’ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను తీస్తున్నాం. మిస్టర్ బచ్చన్.. రవితేజ అభిమానులకే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మేము ఏ ఒక్క వర్గాన్నో దృష్టిలో పెట్టుకుని తీయం. అన్ని వర్గాల ప్రేక్షకులు, అన్ని పార్టీల అభిమానులు మా సినిమా చూడాలని కోరుకుంటాం” అని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − three =