కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన సినిమా ఈగల్. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈసినిమా పోటీ నుండి తప్పుకొని సింగిల్ రిలీజ్ ను ఫిక్స్ చేసుకొని ఫైనల్ గా ఫిబ్రవరి9వ తేదీన రిలీజ్ అయింది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా రవితేజ మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూాడా ఈసినిమా మంచి కలెక్షన్సే రాబట్టుకుంటుంది. మొదటిరోజే ఈసినిమా దాదాపు 12కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఫస్ట్ వీకెండ్ ముగిసింది. ఈ మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 30కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. మరి మూడు రోజుల్లో 30 కోట్లు గ్రాస్ అంటే సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకున్నట్టే. మరి ఈవారం పెద్దగా సినిమాలు లేవు కాబట్టి ఈసినిమాకు కలిసొచ్చే అంశమే. ముందు ముందు మంచి కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇది మాసోడి జాతర! ❤️🔥#Eagle 🦅 collects over 𝟑𝟎𝐂𝐑+ 𝐆𝐑𝐎𝐒𝐒 worldwide in 3 Days 🔥
Don’t miss the BLOCKBUSTER ACTION ENTERTAINER on the Big Screens near you now! 🔥
Book your tickets Now – https://t.co/jwxSyt0AT8#PublicBlockbusterEagle 💥🔥@Raviteja_offl… pic.twitter.com/wkMAFSzysh
— People Media Factory (@peoplemediafcy) February 12, 2024
కాగా ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలకపాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈసినిమాకు సంగీతం దేవ్ జాన్డ్, సినిమాటోగ్రఫి కార్తీక్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: