చరణ్ పై శర్వా ప్రశంసలు-నాకు స్నేహితుడు కావడం గర్వకారణం

hero sharwanand praises on ram charan

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో పేరు సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా రామ్ చరణ్ లాంటి వక్తి నాకు ఫ్రెండ్ అవ్వడం గర్వకారణం అంటున్నాడు ఓ యంగ్ హీరో. ఆ హీరో ఎవరో కాదు శర్వా. శర్వానంద్, రామ్ చరణ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా ఓ టాక్ షో లో పాల్గొన్నశర్వానంద్ చరణ్ పై ప్రశంసలు కురిపించాడు. టాక్ షోలో పాల్గొన్న శర్వాను చిరంజీవి గురించి అడుగగా.. చిరంజీవి గారి గొప్పదనం గురించి ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. ఇండస్ట్రీకి వచ్చినప్పటినుండీ ఆయన తన వెంట ఉన్న వారికి, తనను నమ్ముకున్న వారికి ఎప్పుడూ అండగానే ఉంటూ ఉన్నారు.. చిరంజీవి గారి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చని అన్నాడు. ఇంకా చరణ్ గురించి మాట్లాడుతూ చిరంజీవి గారి లాగానే రామ్‌చరణ్ కూడా తన వాళ్లకు అండగా ఉంటాడు. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటాడు. అలాంటి వ్యక్తి నాకు స్నేహితుడు కావడం గర్వకారణం అంటూ ప్రశంసలు కురిపించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =