టాలీవుడ్ హీరో నిఖిల్ తన 20వ చిత్రంగా ‘స్వయంభూ’ అనే సోషియో ఫాంటసీగా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన లెజెండరీ యోధుడి పాత్రను పోషించనున్నాడు. ఈ నేపథ్యంలో నిఖిల్ ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అద్భుతమైన వార్ సీక్వెన్సులు ఉండే ఈ సినిమాలో అన్ బిలీవబుల్ స్టంట్స్ చేయడానికి సిద్దమయ్యాడు. ఇక అతనితో పాటు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంయుక్త మీనన్ కూడా కథ ప్రకారం, ఇందులో కొన్ని స్టంట్స్ చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందుకోసం తాజాగా ఆమె ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకోవడం ప్రారంభించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో దీని గురించి వివరిస్తూ.. “నా తదుపరి చిత్రం స్వయంభూ కోసం, నేను గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను. ఇది అభూతమైన ప్రయాణం. మేమంతా ఒక టీమ్ గా కలిసి పనిచేస్తున్నాం” అని తెలిపింది సంయుక్త మీనన్. కాగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
ఇక ‘స్వయంభూ’ మూవీ అత్యుత్తమ సాంకేతిక, ప్రొడక్షన్ వాల్యూస్‌తో అద్భుతంగా రూపొందుతోంది. దీనిలో భాగంగా ‘కేజీఎఫ్’, ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో స్వయంభూ కీలక షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇందులో నిఖిల్‌తో పాటు చిత్రంలోని ఇతర తారాగణం షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: