OG డీప్ మ్యూజిక్ డిస్కషన్స్

sujeeth and thaman deep discussion for OG movie

పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగింది. ఈసినిమా షూటింగ్ అయితే ఎప్పుడో మొదలైంది. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుది. ప్రస్తుతం అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా షూటింగ్ సంగతి పక్కన పెడితే ఈసినిమా నుండి ఈమధ్య అప్ డేట్లు ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సెప్టెంబర్ 27వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఆ తరువాత మరో పవర్ ఫుల్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో క్రేజీ అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా డైరెక్టర్ సుతీజ్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సీరియస్ గా కుర్చొని డిస్కషన్స్ చేస్తున్న ఫోటోని చిత్రయూనిట్ షేర్ చేసి ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు అని తెలిపారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ ఫొటో కింద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వాలని, పవన్ కి ఎలివేషన్స్ లో బీజీయం సూపర్ గా ఉండాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by DVV Entertainment (@dvvmovies)

ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.