సినిమా అప్ డేట్లపై మారుతి ఫన్నీ కౌంటర్

director maruthi funny counter to netizen

ఈమధ్య డైరెక్టర్లు కూడా సోషల్ మీడియాలో ఏ మాత్రం తగ్గట్లేదు. వారు కూడా నెటిజన్లకు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ మారుతి కూడా తన ట్విట్టర్ ద్వారా ఒక నెటిజన్ కు ఫన్నీ కౌంటర్ ఇచ్చారు. అసలు సంగతేంటంటే.. మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్నా రవి ప్రధాన పాత్రలలో వచ్చిన సినిమా ‘ట్రూ లవర్’. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో లవ్ స్టోరీగా ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమాను తెలుగులో డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా ట్రూ లవర్ సినిమాకు పోదామని థింకింగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ అని అడుగగా దానిని ట్యాగ్ చేస్తూ మారుతి ఫ్రెండ్స్ ను కూడా తీసుకొని వెళ్లు.. ఎప్పుడూ అప్ డేట్స్ గురించి అడగటమే కాదు అంటూ ఫన్నీ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మారుతి ట్వీట్ వైరల్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మారుతి ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. రాజాసాబ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇక చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ మళ్లీ ఫుల్ ఫన్ ఉండే క్యారెక్టర్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈసినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం ఇంకాస్త టైమ్ పడుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =