హనుమాన్ హిందీలో 50కోట్ల నెట్ మార్క్ ను చేరుకుంది.మొదటి వారం 22.92కోట్లు రెండో వారం 16.67,మూడో వారం 6.47,నాలుగో వారం 3.68 నెట్ వసూళ్లను రాబట్టగా ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చి మూడు రోజుల్లో 1.02కోట్ల నెట్ తో 50.76కోట్ల నెట్ ను ఖాతాలో వేసుకుంది దాంతో హిందీలో అత్యధిక వసూళ్ల రాబట్టిన దక్షిణాది సినిమాల జాబితాలో హనుమాన్ 10వ స్థానాన్నిదక్కించుకుంది.ఈ జాబితాలో బాహుబలి 2,కెజియప్ 2,ఆర్ఆర్ఆర్,రోబో 2.0,సలార్ ,సాహో,బాహుబలి,పుష్ప,కాంతారా వరుస స్థానాల్లో కొనసాగుతున్నాయి.ఇక ఈసినిమాకు సూపర్ రెస్పాన్స్ రావడంతో జై హనుమాన్ కు ప్లస్ అవ్వనుంది.హనుమాన్ కు ఈ సినిమా సీక్వెల్ గా రానుంది దాంతో హిట్ టాక్ వస్తే ఈజీగా 100కోట్లు కొల్లగొట్టడం ఖాయం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి.ఈఏడాది సెకండ్ హాఫ్ లో జై హనుమాన్ సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇందులో హనుమాన్ గా ఓ స్టార్ హీరోను తీసుకోనున్నారు.ఇక హనుమాన్ ప్రపంచ వ్యాప్తంగా 290కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అత్యధిక వసూళ్లను రాబట్టిన మీడియం బడ్జెట్ మూవీ గా ఆల్ టైం రికార్డు సృష్టించింది.అంతేకాదు తెలుగులో ఆల్ టైం సంక్రాంతి గ్రాసర్ గా కూడా ఘనత సాధించింది.
కేవలం 30కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈసినిమా 100కోట్ల కు పైగా లాభాలను తీసుకొచ్చింది.ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో తేజ సజ్జా హీరోగా అతనికి జోడిగా అమృతా అయ్యర్ కనిపించింది.వరలక్ష్మి శరత్ కుమార్,సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు.నిరంజన్ రెడ్డి ఈసినిమాను నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: