ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాను మొదలుపెట్టి దాదాపు నాలుగేళ్లు అయిపోయింది. ఎంతో కష్టపడి ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి8వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈసినిమా మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసిన సంగతి విదితమే కదా. మేకింగ్ వీడియోకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. కిష్టమైన వాతావరణ పరిస్థితిల్లో ఎలా మేకింగ్ చేశారో వీడియోలో చూపించారు. మేకింగ్ వీడియో అయితే సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈసినిమాపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. చాలా ఓపిక గా, ఎంతో ప్రేమతో, ఇంత కాలం ఈసినిమా కోసం ఏం అచీవ్ చేశారో చూసేందుకు వేచి ఉండలేకపోతున్నా అంటూ నాగ్ అశ్విన్ పోస్ట్ లో పేర్కొన్నాడు.
Creative director @nagashwin7 is all praise for Team #Gaami and the passion they made the film with ❤🔥
In cinemas March 8th 🧿@VishwakSenActor @ChandiniC @mgabhinaya @KarthikSabaresh @nanivid #NareshKumaran @_Vishwanath9 @Synccinema… pic.twitter.com/krtTKFcvip
— Telugu FilmNagar (@telugufilmnagar) February 12, 2024
కాగా ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























