వ్యూహం, శపథం.. రిలీజ్ డేట్స్ ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma Announced Release Dates of Vyooham and Shapadham Movies

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కి ‘వ్యూహం’ అని, సెకండ్ పార్ట్‌కి ‘శపథం’ అని ఇప్పటికే పేర్లను కూడా ఖరారు చేశారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌లో దాసరి కిరణ్ కుమార్ వీటిని నిర్మిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. ఈ క్రమంలో తాజాగా ఈ రెండు సినిమాలకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వ్యూహం, శపథం చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా శనివారం వెల్లడించారు. దీని ప్రకారం.. ముందుగా వ్యూహం రిలీజ్ అవుతుండగా.. దీనిని ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. అలాగే శపథం చిత్రాన్ని మార్చి 1వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా మరికొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ చిత్రాలపై సర్వత్రా ఆసక్తి నెలకొండి. ఇక గత ఎన్నికల సమయంలో కూడా వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమాను రిలీజ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

అయితే ఈ పాటికే విడుదల కావాల్సి ఉన్న ‘వ్యూహం’ సినిమా అనుకోని అవాంతరాలతో పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఏపీలోని ప్రధాన ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుని విమర్శనాత్మకంగా తీశారని, దీని వలన తమ మనోభావాలు దెబ్బ తింటాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ నాయకుడు నారా లోకేష్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో తాత్కాలికంగా సినిమా విడుదల నిలిచిపోయింది. అయితే తాజాగా ఈ అవాంతరాలను అన్నింటినీ దాటుకుని సెన్సార్ బోర్డు వ్యూహం సినిమాకు సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహంతో పాటుగా ఒకేసారి శపథం సినిమా రిలీజ్ డేట్లను ప్రకటించడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =