ఈ సినిమాతో సందీప్ కిషన్ నెక్స్ట్ రేంజ్‌కి వెళ్తాడు – అనిల్ సుంకర

Producer Anil Sunkara Praises Sundeep Kishan at Ooru Peru Bhairavakona Press Meet

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్‌ని నిర్వహించింది. గ్రాండ్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. “ఊరు పేరు భైరవకోన టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు సందీప్, దర్శకుడు, టీం అంతా పడిన శ్రమ అర్ధమౌతుంది. సినిమా చూశాను. దర్శకుడు ఆనంద్ చెప్పిన దానికంటే చాలా అద్భుతంగా తీశాడు. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాం. చాలా మంచి సినిమా ఇది. సందీప్ ఈ సినిమాలో నెక్స్ట్ రేంజ్‌కి వెళ్తాడు. ప్రౌడ్లీ ప్రజెంట్స్ అనే దానికి.. ఐ యామ్ ప్రౌడ్” అని పేర్కొన్నారు.

అలాగే ఈ చిత్ర దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ.. “ఊరు పేరు భైరవకోన అద్భుతమైన జర్నీ. ప్రతి మూమెంట్ మాకు ఓ కొత్త అనుభవం. ఊరు పేరు భైరవకోన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్, సూపర్ నేచురల్ ఫాంటసీ, మంచి లవ్ స్టొరీ వుంది. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ఎమోషన్ హారర్ థ్రిల్ పీక్స్ లో వుంటాయి. ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫిబ్రవరి16న తప్పకుండ అందరూ థియేటర్స్ లో చూడాలి” అని కోరారు. కాగా ఊరు పేరు భైరవకోన చిత్రం ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + eighteen =