మొదటినుండీ సుధీర్ బాబు కూడా కాస్త డిఫరెంట్ సినిమాలే చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుండేవాడు. కొన్ని మంచి విజయం సాధించగా.. కొన్ని మాత్రం పరాజయాలే అందించాయి. అయినా కూడా సుధీర్ బాబు జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరోం హర సినిమా కూడా ఒకటి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజులే అవుతుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ సింగిల్ హరోం హరోం హర అనే పాటను ఫిబ్రవరి 14వ తేదీన సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
శిఖరానా ఉండే సామి ఏంటికి నన్ని మీకాడికి పంపుతాండడో సెప్పే పాట ఈ పదనాల్గో తేదీ వస్తా ఉండాది!#HaromHaromHara#HaromHara First single will be out on 14th Feb at 5:00PM💥@ImMalvikaSharma @gnanasagardwara @SumanthnaiduG @chaitanmusic @SSCoffl @JungleeMusicSTH pic.twitter.com/9QcoV7D5yX
— Sudheer Babu (@isudheerbabu) February 12, 2024
కాగా కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్ తో ఈసినిమా రానున్నట్టు అర్థమవుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: