మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమాను మార్చి1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే వరుసగా అప్ డేట్లతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను పలు పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా ఈసినిమాలో నటిస్తున్న మరో పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో రుహానీ శర్మ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఈమేరకు తను ఈసినిమాలో తాన్య శర్మగా నటిస్తున్నట్టు చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
A walking example of courage and fortitude💥
Introducing @iRuhaniSharma as #TanyaSharma for #OperationValentine ❤️🔥
Meet her on the big screens from MARCH 1st🔥#OPVonMarch1st@IAmVarunTej @ShaktipsHada89 @ManushiChhillar @MickeyJMeyer @ShatafFigar #PareshpAhuja @sidhu_mudda pic.twitter.com/Jgw5oRZ1Pl
— Renaissance Pictures (@RenaissancePicz) February 12, 2024
కాగా ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























