టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో అల్లు అర్జున్ నుండి వస్తున్న పుష్ప2 సినిమా కూడా ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాను ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదన్న క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇక ఆ దిశగానే షూటింగ్ ను కూడా చాలా స్పీడుగా పూర్తిచేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేస్తున్నారు మేకర్స్. ఇక ఇదిలా ఉండగా తాజాగా షూటింగ్ సెట్ నుండి తీసిన సుకుమార్ క్యాండిడ్ క్లిక్ ను హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేశారు. సింహం విగ్రహం పై కాస్త ఒరిగి ఉన్న డైరెక్టర్ సుకుమార్ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Srivalli candidly captures the maverick director 📸@iamRashmika shared a picture of @aryasukku clicked by her on the sets of #Pushpa2TheRule ❤️
Shoot in Progress at a Rapid Pace!! 🔥
Grand Release Worldwide on 15th AUG 2024 ❤🔥#2024RulePushpaKa 💥💥
Icon Star @alluarjun… pic.twitter.com/35lbpxRfHF
— Pushpa (@PushpaMovie) February 12, 2024
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది. జగపతిబాబు కూడా ఓకీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: